చాలా మంది ఎక్కువగా క్రికెట్ ని ఇష్టపడి చూస్తూ ఉంటారు. వరల్డ్ కప్ వన్డే టోర్నీ లలో ఇరు జట్లు ఆడే తీరును చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఏ టీం గెలుస్తుందా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల ప్లేయర్లు క్రికెట్ కి ప్రాణం పెట్టేస్తారు. ఓటమి ని అస్సలు అంగీకరించరు చాలా యాషెస్ మ్యాచులు ఆఖరి వరకు కూడా వెళ్తూ ఉంటాయి.
Advertisement
ఒత్తిడిని తట్టుకుంటేనే గెలుపు సొంతం అవుతుంది. ఈసారి ఆసీస్ సిరీస్ కి ఘనమైన ఆరంభం వచ్చింది. చివరి రోజు లాస్ట్ సెక్షన్ లో ఎప్పటిలాగే గెలుపు వచ్చింది ఆసీస్ రెండు వికెట్ల తేడా తో ఇంగ్లాండు ని ఓడించింది. ఓపెనర్ కవాజా 65 రన్స్ చేసాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే 44 పరుగులు చేసాడు ఇలా వీళ్ళిద్దరూ కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్ లో ఇలా జరగడం వలన ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పై విమర్శలు వస్తున్నాయి.
Advertisement
బజ్‌బాల్ తో స్టోక్స్ ఫస్ట్ డే సాహసమే చేసాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 రన్స్ వద్ద డిక్లేర్ చేశాడు. ధీటుగా ఆసీస్ సమాధానం ఇచ్చింది. 386 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. స్టోక్స్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయకపోయి ఉంటే ఇంగ్లండ్ కి ఇంకో 30 నుంచి 40 రన్స్ లీడ్ వచ్చేది. అప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు బాగా కష్టం అయ్యేది. స్టోక్స్ చేసిన ఆ తప్పు వల్లే ఇంగ్లండ్ ఓడింది. ప్రతి సారి బజ్‌బాల్ వర్క్ అవుట్ కాదు అని స్ట్రోక్స్ తెలుసుకోవాలి.
Also read:
చిరంజీవికి మొత్తం ఎంత మంది మనవరాళ్లు అంటే..?