Telugu News » Blog » ‘రేగుపండ్లను’ బోగి పండ్లని ఎందుకు పిలుస్తారు…వాటితో ఎందుకు దీవిస్తారో తెలుసా ?

‘రేగుపండ్లను’ బోగి పండ్లని ఎందుకు పిలుస్తారు…వాటితో ఎందుకు దీవిస్తారో తెలుసా ?

by AJAY
Ads

సంక్రాంతి అంటే పెద్దలు పిల్లలు అంతా కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ కు పిండి వంటలు, కోడిపందాలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, గాలిపటాలు అదే విధంగా ముగ్గులు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఈ పండుగను బంధువులు కుటుంబ సభ్యుల మధ్యన వేడుకగా జరుపుకుంటారు. ఇక ఇతర పండుగలు ఒకటి రెండు రోజులు ఉంటే సంక్రాంతి మాత్రం మూడు రోజుల పాటు సాగుతుంది. ఇక మూడు రోజులకు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

Advertisement

Bogi pandlu

Bogi pandlu

మూడు రోజుల్లో భోగి పండగనాడు చిన్నారులను బోగి పండ్లతో అంటే రేగుపండ్లతో పెద్దలు దీవిస్తారు. సంక్రాంతి లో ముఖ్యమైన ఘట్టం కూడా ఇదే. అయితే దీని వెనక ఒక కథ కూడా ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. రేగి పండ్లతో పురాణాలకు సంబంధం ఉంది. రేగు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా మనం తినే ఇతర పండ్ల కంటే ఎక్కువ మంచి గుణాలు రేగుపండులో ఉంటాయి. అందువల్లే భోగినాడు పిల్లలను రేగుపండ్లతో దీవిస్తారు.

Boghi special

Advertisement

ఇక రేగి చెట్టు అప్పట్లో మహారానా ప్రతాప్ అనే రాజును ఆయన సైన్యాన్ని బతికించినట్టు చరిత్ర చెబుతోంది. అక్బర్ తో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మహారానా ప్రతాప్ తన సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్లిపోయారట. అక్కడ వాళ్ళు చాలా ఏళ్ల పాటు గడపాల్సి వచ్చింది. దాంతో తినడానికి తిండి కూడా దొరకలేదు. కానీ అడవిలో పుష్కలంగా రేగుపండ్లు ఉండటంతో వాటిని తిని బతికినట్టు చరిత్ర చెబుతోంది.

Sankranthi

అప్పటినుండి రేగు చెట్టు, రేగు పండ్ల వల్ల అన్ని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. శివుడికి ఇష్టమైన పండు కూడా రేగి పండు… రాముడు కూడా శబరి ఎంగిలి చేసిన రేగిపండును తింటాడు. ఇలా మన సంస్కృతిలో రేగుపండ్లు భాగమయ్యాయి. అందువల్లే పిల్లలకి భవిష్యత్తులో ఎలాంటి బాధలు కలగకూడదని, ఎటువంటి సమస్యలు రాకూడదని భోగి పండుగ రోజున రేగి పండ్లతో దీవిస్తారు. అందువల్లే రేగి పండ్లను భోగి పండ్లు అని పిలుస్తారు.

Advertisement

Also read : ఏపీ టికెట్ల అంశంపై నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు…నాకేం ఇబ్బంది లేదు..!