Home » ఏపీ టికెట్ల అంశంపై నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు…నాకేం ఇబ్బంది లేదు..1

ఏపీ టికెట్ల అంశంపై నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు…నాకేం ఇబ్బంది లేదు..1

by AJAY
Ad

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నాగార్జున కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి క‌ల్యాన్ కే క్రిష్ణ‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళిన నాగ చైతన్య‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nagachaitanya

Nagachaitanya

ఏపీ టికెట్ అంశం పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా…. చైతూ కూడా త‌న తండ్రి నాగార్జున లాంటి సమాధానమిచ్చారు. నాగచైతన్య మాట్లాడుతూ…. నేను నటుడిని ప్రాజెక్టుల ఆదాయ అంశాల గురించి నేను పెద్దగా బాధ పడటం లేదు. ఇక్కడ సమస్య గురించి మీరు నా నిర్మాతను అడగాలి. వారికి దానితో సమస్య లేనట్లయితే నాకు కూడా లేదు. ఏప్రిల్ లో జీవో తిరిగి వచ్చింది. ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించాం….. జీవో ఆధారంగా సినిమా బడ్జెట్ ను కూడా స‌వ‌రించుకున్నాము.

Advertisement

Advertisement

Banggaraju

Banggaraju

ప్రభుత్వం అనుమతిస్తే అది మాకు సహాయం చేసినట్లు అవుతుంది. కాకపోతే ఇప్పుడు అమలులో ఉన్న టికెట్ ధరల‌తో మేము సంతృప్తిగానే ఉన్నాము. అంటూ నాగచైతన్య పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం థియేటర్లలో వంద శాతం సీటింగ్ కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూను కూడా సడలించింది.

అయితే ఈ రెండు నిర్ణయాలు ప్ర‌భుత్వం బంగార్రాజు కోస‌మే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ టికెట్ల అంశంపై నేడు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో చిరు చిత్ర పరిశ్రమ సమస్యలను సీఎంకు వివ‌రిస్తారు. దాంతో సీఎం జ‌గ‌న్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆసక్తికరంగా మారింది.

also read : సీఎం జగన్ వద్దకు సింగిల్ గా మెగాస్టార్….ఈ అంశాలపైనే చర్చ…!

Visitors Are Also Reading