ఎవరికైనా మంచి జీవిత భాగస్వామి దొరికితే ఆ జీవితమంతా ఆనందమయమవుతుంది. మీరు కూడా మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి సిద్ధమవుతున్నట్టు అయితే ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి.సంతోషకరమైన సంబంధానికి మంచి భాగస్వామిని కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం.
Advertisement
మంచి భాగస్వామి దొరికితే జీవితంలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండగలరు. ఆర్థిక శాస్త్రానికి ఆదర్శంగా ఉండే చాణక్యుడు తన విధానంలో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. వివాహం లేదా మరేదైనా భాగస్వామిని పరీక్షించడం చాలా ముఖ్యమని తన గ్రంథాల్లో పేర్కొన్నాడు. మంచి జీవిత భాగస్వామి జీవితంలో సంతోషాన్ని నింపగలరని అంటారు. జీవిత భాగస్వామిని మీరు కూడా ఎంచుకోవడానికి సిద్ధమవుతున్నట్టయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చాణక్య నీతి ప్రకారం.. ముఖ్యంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు అతని శరీర సౌందర్యాన్ని అసలు చూడకూడదు. అతని లక్షణాలను చూడాలి. ఒక వ్యక్తి సంస్కారాన్ని పరీక్షించడం చాలా ముఖ్యం.
Advertisement
అందమైన స్త్రీ కోసం పురుషుడు ఎప్పుడు కూడా పరుగెత్తకూడదు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. స్త్రీకి సత్ప్రవర్తన చాలా అవసరం. సత్ప్రవర్తన కలిగి ఉన్న స్త్రీ ఎలాంటి పరిస్థితులోనైనా కుటుంబాన్ని పోషించగలదు. ఆమె దుఃఖం నుంచి బయటపడుతుంది. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వ్యక్తి బాహ్య సౌందర్యంపై దృష్టి పెట్టకూడదని.. అతని అంతర్గత లక్షణాలపై శ్రద్ధ వహించాలని చాణక్యుడు వెల్లడించాడు.
స్త్రీకి ఓపిక ఉంటే ఆమె మీ ఇంటిని చూసుకుంటుంది. ఏదైనా కోపం వస్తే ఇంటిని, కుటుంబాన్ని సైతం కాల్చేస్తుందని చెప్పాడు. పెళ్లికి ముందే మీ భాగస్వామి కోపాన్ని పరీక్షించుకోండి. ఎక్కడో మీరు దీని కోసం తరువాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. పెళ్లికి ఓ వ్యక్తిని పరిశీలిస్తున్నప్పుడు అతను ఎంత మతపరమైన వాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓ వ్యక్తి గౌరవంగా జీవించడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
ఇవి కూడా చదవండి: ఆ సినిమాల్లో సెట్ ప్రాపర్టీలాగే పనిచేశా….నటి ప్రగతి ఎమోషనల్….!