హైదరాబాద్ నగరం ఒడ్డున అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ దందా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాగుతోంది. కుళ్ళిన అల్లం, బంగాళాదుంపలు, అలాగే అరటి కాయ గుజ్జు యాసిడ్ వంటి ప్రమాణాలతో నిషేధిత టెట్రా జెన్ సింథటిక్ రంగు లతో కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నారు. జిహెచ్ఎమ్ సి ఆహార కల్తీ నియంత్రణ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. సేకరించిన నమూనాలు రాష్ట్ర ఆరోగ్య ప్రయోగశాలలో పరిశీలించగా నాణ్యతకు విరుద్ధంగా అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారవుతుందని తేలింది.ప్రస్తుతం మన ఉరుకుల పరుగుల జీవితాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కల్తీ రాయుళ్లు అచ్చం అల్లం ముద్ద లాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారుచేసి డబ్బాల్లో నింపి ఆ మిశ్రమాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. దీన్ని మనం తింటే అల్లం వెల్లుల్లి పేస్టు లాగానే రుచి కూడా నాలుకపై తిష్ట వేస్తుంది. మసాలా లాగా వాసన వెదజల్లుతుంది. ఇలాంటి వాటిని వాడడం హానికరమని వైద్యులు చెబుతున్నారు. పాతబస్తీలోని జల్లిపల్లి రాజేంద్రనగర్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లో వీటి తయారీ కర్మాగారాలు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమల పై దాడులు చేయాలని ప్రజలు కూడా కోరుతున్నారు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని, ముఖ్యంగా ప్రేగులు దెబ్బతింటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త మరి..!!
Advertisement
also read;
Advertisement
40 ఏళ్లు దాటినా సుబ్బరాజు ఇంకా ఎందుకు పెళ్లికి దూరంగా ఉన్నాడో తెలుసా..!
చిరంజీవి గురించి కోటా శ్రీనివాసరావు ఏమన్నారో తెలుసా..?