కొందరికీ తెల్లారిందంటే చాలు వేడి వేడి టీ కావాల్సిందే. టీ తాగకపోతే వారికి ఏమి తోచదు. అసలు ఆ రోజు ప్రారంభం అయినట్టే ఉండదు. మరికొందరయితే బెడ్ టీతోనే వారు ఆ రోజును ప్రారంభిస్తారు. టీ అంటే దాదాపు 70 శాతం మంది ప్రజలు ఇష్టపడతారు. కానీ ఆ టీ తాగే సమయంలో మాత్రం ఈ ఆహారాలను మాత్రం అస్సలు తీసుకోకండి. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు ఉల్లిపాయలను తరుచూ తింటుంటారు. ఉల్లిపాయలను పచ్చిగా తిని ఆ తరువాత టీ తాగరాదు. అలా తాగితే జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి. కొందరికి అయితే అలర్జీలు వచ్చేందుకు అవకాశాలుంటాయి. అదేవిధంగా ఉడకబెట్టి కోడిగుడ్డు, సలాడ్, మొలకలు తిని కూడా టీ అస్సలు తాగకూడదు. జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Advertisement
అదేవిధంగా నిమ్మరసం తాగిన తరువాత కూడా టీ తాగరాదు. తాగితే కడుపులో విపరీతమైన మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొందరిలో విరేచనాలు కూడా కావచ్చు. మరికొందరు శనగపిండితో తయారు చేసిన చిరుతిళ్లను తిన్నాక లేదా తింటూ టీ తాగుతారు. వాస్తవానికి ఇలా చేయకూడదు. వాటిని తింటూ లేదా తిన్న తరువాత టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు నష్టం జరుగుతుంది.
Advertisement
పసుపును లేదా పసుపుతో తయారు చేసే పదార్థాలను తిన్న వెంటనే కూడా టీ అస్సలు తాగకూడదు. అలా తాగిలే జీర్ణవ్యవస్థలో ఇబ్బందులువస్తాయి. అజీర్ణం, గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. టీ తాగక ముందే నీటిని తాగాలి. కానీ టీ తాగిన తరువాత నీళ్లను తాగరాదు. ఒకవేళ తాగితే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. అదేవిధంగా గ్యాస్ వస్తుంది. కాబట్టి టీ తాగకముందే నీళ్లను తాగాలి. లేదంటే గ్యాస్ సమస్య, జీర్ణవ్యవస్థ సమస్యను తెచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి టీ తాగే సమయంలో జాగ్రత్తగా ఉండడం బెటర్ సుమా..!
ఇవి చదవండి :
1. MAHESH BABU : సర్కారు వారి పాట స్టొరీ లీక్….ఇదే నిజమైతే ఈ సినిమా కూడా…!
2. మన స్టార్ హీరోయిన్లు వేసుకున్న టాటూలు, వాటి వెనుకున్న అర్థాలు అవేనా ?
3. చెరకు రసం తయారు చేసేటప్పుడు గడల మధ్య నిమ్మకాలు ఎందుకు ఉంచుతారో తెలుసా..?