Home » BCCI కీలక నిర్ణయం.. ఉప్పల్‌ స్టేడియానికి రూ.117 కోట్లు!

BCCI కీలక నిర్ణయం.. ఉప్పల్‌ స్టేడియానికి రూ.117 కోట్లు!

by Bunty
Ad

 

భారత పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-2తో కోల్పోయిన ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ను మాత్రం 2-1తో కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఇక ఇప్పుడు అందరు వన్డే వరల్డ్ కప్ 2023 కోసం చూస్తున్నారు. అయితే, ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ సమయంలో వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ ఏర్పాట్లు మొదలుపెట్టింది బీసీసీఐ.

READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?

Advertisement

ఇందులో భాగంగా, ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేసేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఉండటం విశేషం. వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ తో పాటు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం, కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్, మోహాలి పిసిఏ స్టేడియం, ముంబై స్టేడియాల్లో కనీస సౌకర్యాలు లేవని అభిమానుల నుంచి ఫిర్యాదులు వస్తుండటం వల్ల వాటికి మరమ్మతులు చేసేందుకు సిద్ధమైంది.

Advertisement

READ ALSO : Niharika konidela : నిహారిక పనుల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు

ODI World Cup 2023: Here's list of probable 20 shortlisted players by BCCI | Cricket News – India TV

ఇందుకోసం బీసీసీఐ సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి రూ.117.17 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ కు రూ.127.47 కోట్లు, మోహాలి పిసిఏ స్టేడియానికి రూ. 79.46 కోట్లు, ముంబై వాంఖడే స్టేడియానికి రూ. 78.82 కోట్లు కేటాయించనుంది. అయితే మొహాలీలో ప్రపంచకప్ మ్యాచులు లేకపోయినా అక్కడి మైదానాన్ని రెనోవేట్ చేయాలని బోర్డు నిర్ణయించింది.

read also : Tirumala : వెంకటేశ్వర స్వామి కి “వడ్డికాసులవాడు” అని పేరు ఎలా వచ్చింది ?

Visitors Are Also Reading