Home » మహిళల ఐపీఎల్ పై క్లారిటీ.. మొత్తం 5 జట్లు..!

మహిళల ఐపీఎల్ పై క్లారిటీ.. మొత్తం 5 జట్లు..!

by Azhar
Ad

2008 లో పురుషుల ఐపీఎల్ ప్రారంభించిన బీసీసీఐ.. వచ్చే ఏడాది నుండి మహిళల ఐపీఎల్ ను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ అనేది వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. ఇక ఈ లీగ్ గురించి కొన్ని విషయాలు అనేవి బయటకు వచ్చాయి. అయితే పురుషుల ఐపీఎల్ లో 10 జట్లు ఉంటె.. ఈ మహిళల ఐపీఎల్ లో కేవలం 5 జట్లే ఉండనున్నాయి.

Advertisement

ఇక ఒక్కో జట్టులో మొత్తం 18 మంది ప్లేయర్స్ ఉండవచ్చు. అందులో 6 విదేశీ ప్లేయర్స్ కు ఛాన్స్ ఉంది. ఇందులో ఒక్కరు ఐసీసీ అసోసియేట్ దేశం వారు కావాలి. ఇక తుది జట్టులో 5 విదేశీ ప్లేయర్స్ ఉండవచ్చు. అయితే ఈ ఐపీఎల్ కూడా పురుషుల ఐపీఎల్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇక ఇందులోని లీగ్ దర్శాల్లో ఒక్కో జట్టు ప్రతి జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత ప్లే ఆప్స్.. ఫైనల్స్ ఉంటాయి. ఇక ఈ మొత్తం జట్లు కేవలం రెండు వేదికల్లోనే జరగనున్నాయి.

Advertisement

అయితే పురుషుల ఐపీఎల్ లో జట్లు.. ఒక్కో ప్రధాన నగరం పేరిట ఉన్నాయి అనేది తెలిసిందే. కానీ మహిళల జట్లను ఇలా నగరాల పేరిట కాకుండా.. జోన్ల వైడ్ గా ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటుంది. అంటే జట్లు నార్త్ , సౌత్ , సెంట్రల్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, వెస్ట్ అంటూ ఉండనున్నాయి అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఇండియా పరువు తీసిన కెఎల్ రాహుల్..!

శ్రేయాస్ ను మళ్ళీ అవమానించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading