Ad
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద లీగ్ గా నడుస్తుంది. అయితే క్రికెట్ పైనా జనాలకు ఆసక్తి పెంచడానికి అన్ని దేశాల బోర్డులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ మధ్య ఆటను జనాలకు దగ్గరగా చూపించడానికి హెల్మెట్ లో కెమెరాను పెట్టింది ఇంగ్లాండ్ బోర్డు. ఇక ఇప్పుడు బీసీసీఐ కూడా అదే క్రమంలో ఓ కొత్త రూల్ ను తీసుకురాబోతుంది.
అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. అయితే ఈ నియమం క్రికెట్ కు కొత్త కావచ్చు. కానీ ప్రపంచంలో పాపులర్ అయిన ఫుట్ బాల్, రగ్బి, బాస్కెట్ బాల్ ఇలా అన్ని గేమ్స్ లో అది ఉంది. అయితే ఈ నియమం ప్రకారం ఆట మధ్యలో అంటే 14 ఓవర్లు పూర్తి కాకముందు.. జట్టులో ఒక్క మార్పు అనేది చేయవచ్చు. ఆటకు ముందుగా ప్రకటించిన జట్టులో నుండి ఒక్క అఆటగాడిని బయటకు పంపించి.. మరొక ఆటగాడిని మ్యాచ్ లోకి తీసుకోవచ్చు.
అయితే ఈ నియమం బ్యాటింగ్, బౌలింగ్ రెండు సమయాల్లో పని చేస్తుంది. అయితే మ్యాచ్ మధ్యలో బయకు వచ్చిన ఆటగాడు మళ్ళీ ఇక గ్రౌండ్ లోకి రావటానికి వీలు ఉండదు. కనీసం సబ్స్టిట్యూట్ ఆటగాడిగా కూడా ఉండకూడదు. అయితే దీనిని మొదట మన దేశవాళీ టోర్నీలో తీసుకురాబోతుంది. అక్కడ ఇది పని చేస్తే.. వచ్చే ఐపీఎల్ 2023లో అమలులోకి తెచ్చే అవకాశం అనేది ఉంది.
ఇవి కూడా చదవండి :
గుజరాత్ టైటాన్స్‌కు గిల్ బై బై..!
పాక్ సెలక్షన్ పై విమర్శలు..!
Advertisement