Ad
ఆస్ట్రేలియాలో వచ్చే నెల చివరి నుండి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2022 లో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన తర్వాత దానిపై చాలా విమర్శలు వచ్చాయి. అందులో కొంతమందికి ఉండాల్సిన ఆటగాళ్లు లేరు ఫ్యాన్స్ అలాగే మాజీలు కూడా ఫీల్ అయ్యారు. అలాంటి ఆటగాళ్లలో సంజూ శాంసన్ పేరు అనేది ఉంటుంది. అయితే ఆసియా కప్ లో కీపర్ అయిన రిషబ్ పంత్ పూర్తిగా విఫలం అయ్యాడు.
ఆ కారంణంగా ఈ ప్రాపంచ కప్ కు పంత్ ను పక్కన పెట్టి.. కీపర్ గా సంజూని ఎంపిక చేస్తారు అని భావించారు. కానీ అలా జరగలేదు. దాంతో బీసీసీఐ సెలక్షన్ ను అందరూ విమర్శించారు. అయితే తాజాగా సంజూ ఎంపికపై ఓ బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేసాడు. అయితే ప్రపంచ కప్ జట్టుకు పరిశీలించిన ఆటగాళ్లలో అసలు సంజూ పేరు కూడా లేదు అని పేర్కొన్నాడు.
సంజూను కేవలం వన్డేలను మాత్రమే ఆడించాలని బీసీసీఐ ఫిక్స్ అయ్యింది. అందుకే సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు ఎలాగైనా సంజూను జట్టులో ఆడిస్తాం అని ఆయన చెప్పాడు. ఇక పంత్ ను పక్కన పెట్టాలి అనే ఆలోచన బీసీసీఐకీ లేదు అని.. అందుకు కారణం మన బ్యాటర్లలో అతను ఒక్కడే ఎడమ చేతి వాటం బ్యాటర్ అని తెలిపాడు. అలాగే పంత్ కు ఒంటిచేతితో మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉంది అని కూడా ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి :
పాకిస్థాన్ పుస్తకాల్లోకి ఎక్కిన బాబర్..!
కేఎల్ రాహుల్ త్యాగం చేయాలి..!
Advertisement