Home » టీమిండియాను పాకిస్థాన్ పంపాలనుకుంటున్న బీసీసీఐ.. కానీ..?

టీమిండియాను పాకిస్థాన్ పంపాలనుకుంటున్న బీసీసీఐ.. కానీ..?

by Azhar
Ad

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉండే కిక్ అనేది వేరే లెవల్ లో ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ రెండు దేశాలు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆసియా కప్ లో రెండు సార్లు తలపడిన ఈ జట్లు… ఈ నెల 23న ప్రపంచ కప్ లో మళ్ళీ తలపడబోతున్నాయి. కానీ వచ్చే ఏడాది కూడా ఈ రెండు జట్లు పోటీ పడే మ్యాచ్ లను చూడటం సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది.

Advertisement

అయితే వచ్చే ఏడాది మన ఇండియాలో వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ ఇండియాకు రావాల్సి ఉంటుంది. కానీ అంతకంటే ముందు మన ఇండియా పాకిస్థాన్ వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ మెగా టోర్నీ కంటే ముందు ఆసియా కప్ 2023 అనేది పాకిస్థాన్ వేదికగా జరగనుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్తానే.. వారు ఇక్కడికి వస్తారు.

Advertisement

ఇక రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల కారణంగా మన ఇండియా పాక్ కు వెళ్ళాక చాలా ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆసియా కప్ కోసం ఇండియా జట్టును పాక్ పంపాలి అని బీసీసీఐ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ జట్టును అక్కడికి పంపాలా.. వద్ద అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అని తెలుస్తుంది. అంటే తమకు పంపాలి అని ఉన్న.. సెంట్రల్ వద్దు అంటే మాత్రం జట్టును పాక్ పంపదు బీసీసీఐ.

ఇవి కూడా చదవండి :

మహిళల ఐపీఎల్ పై క్లారిటీ.. మొత్తం 5 జట్లు..!

కోహ్లీ – రోహిత్ కెప్టెన్సీలో తేడాలు ఇవే..!

Visitors Are Also Reading