Home » ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!

ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!

by Azhar
Ad

ఐపీఎల్ ప్రసార హక్కులు గత 5 సంవత్సరాల నుండి స్టార్ స్పోర్ట్స్ దగ్గర ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ముగిసిపోనుంది. దాంతో వచ్చే ఈఏడాది నుండి ఐదు సంవత్సరాల వరకు ఆంటే 2023-2028 వరకు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్ నిర్వహిస్తుంది బీసీసీఐ. బిడ్డింగ్ కు కనీస ధరను రూ.32,890కోట్ల గా నిర్ణయించింది. అయితే ఈ బిడ్డింగ్ లో ఓ కొత్త నియమయాని చేర్చింది. అదే వచ్చే ఏడాది నుండి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభ సమయాలను మార్చాలి అని నిర్ణయించుకుంది.

Advertisement

ప్రస్తుతం ఒక్క మ్యాచ్ ఉన్న రోజు రాత్రి7.30 గంటలకు ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్ లను వచ్చే ఏడాది నుండి 8 గంటలకు ప్రారంభించాలని బిడ్డింగ్ కోసం ప్రయత్నిస్తున్న వారికీ తెలియజేసింది. అదే విధంగా డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు కూడా వీలైనంత తక్కువగా ఆడించాలని తెలిపింది. అలాగే ఈ డబుల్ హెడర్‌ మ్యాచ్‌లు ఉన్న రోజు మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు మొదలు చేయాలనీ సూచించింది బీసీసీఐ. అయితే లెక్క ప్రకారం ఇవేమి కొత్త నియమాలు కాదు.

Advertisement

ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుండి 2018 వరకు కూడా మ్యాచ్ లను ఇవే సమయాలలో నిర్వహించేవారు. కానీ 2019 లో ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ తీసుకున్న తర్వాత రాత్రి మ్యాచ్ ను ఒక్క 30 నిముషాలు ముందు జరపాల్సిందిగా బీసీసీఐని కోరింది. అలా చెయ్యడం వల్ల ప్రైమ్ టైం.. అలాగే ప్రేక్షకులు పెరుగుతారని తెలిపింది. బీసీసీఐ కూడా దానికి ఒప్పుకుంది. అలాగే రెండు మ్యాచ్ లు ఉంటె… మొదటి మ్యాచ్ ను కూడా 3.30కు ప్రారంభించడానికి బీసీసీఐని ఒప్పించింది. కానీ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఒప్పందం గడువు ముగియడంతో మళ్ళీ అదే పాత పద్దతిని తీసుకువస్తుంది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ ఫైనల్ టైమింగ్ ఛేంజ్.. ఎప్పుడంటే…?

పంత్.. నువ్వు ఇగో తగ్గించుకోకపోతే కష్టమే..!

Visitors Are Also Reading