భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఓ షాక్ అనేది ఇచ్చింది. మా నియమాలు పాటించకపోతే ధోని అయిన శిక్ష తప్పదు అని బీసీసీఐ పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో సౌత్ ఆఫ్రికా బోర్డు ఆరు జట్లతో ఓ క్రికెట్ లీగ్ ను ప్రారంభిస్తుంది. అయితే ఈ లీగ్ లోని ఆరు జట్లను మన ఐపీఎల్ జట్ల ఓనర్లే కొన్నారు. అందులో చెన్నై సూపర్ కింగ్ జట్టు యాజమాన్యం కూడా ఉంది.
Advertisement
అందువల్ల ఈ సౌత్ ఆఫ్రికా లీగ్ లో ధోనిని ఆడించాలని బీసీసీఐ భావించింది. ఒకవేళ మ్యాచ్ లు ఆడించడం కుదరకపోతే కనీసం మెంటార్ గా అయిన ఉంచాలి అని చెంన్సీ జట్టు యాజమాన్యం అనుకుంది. ఇక అందుకోసమా ధోని కూడా బీసీసీఐ వద్ద ఎన్ఓసీ కోసం పిటిషన్ ఇచ్చారు. కానీ బీసీసీఐ నియమాల ప్రకారం భారత దేశానికి చెందిన ఏ ఆటగాడు కూడా విదేశీ లీగ్స్ లో ఆడటానికి వీల్లేదు.
Advertisement
ఒకవేళ అలా ఆడాల్సి అంటే ఐపీఎల్ తో సహా దేశవాళీ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఆడితే వారిని సస్పెండ్ చేస్తారు. మళ్ళీ ఐపీఎల్ లో ఆడనివ్వరు. కానీ ఇప్పుడు ధోని ఐపీఎల్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. అందుకే ధోని అయిన కూడా మా నిర్ణయం మారదు. వేరే లీగ్స్ లో పాల్గొనటానికి వీల్లేదు. ఒకవేళ ఆడాలి అనుకుంటే ఐపీఎల్ కు వీడ్కోలు పలకాలి అని ధోనికి బీసీసీఐ సూచించినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :