ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఇండియా ప్రస్తుతం సెమీస్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. కానీ గతంలో ఇండియా ఆడిన మ్యాచ్ లలో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేవి ఇండియా జట్టుకు కలిసి వచ్చాయి. దాంతో ఐసీసీ ఇండియాకు సహకరిస్తుంది అని పాకిస్థాన్ ఫ్యాన్స్ తో పాటుగా ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కామెంట్స్ చేసాడు.
Advertisement
అయితే ఆఫ్రిది చేసిన కామెంట్స్ అనేవి వైరల్ కావడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ… ఆఫ్రిది చేసిన కామెంట్స్ అనేవి మాకు సమంజసం కాదు. ఐసీసీ అనేది అన్ని జట్లను సమానంగా చూస్తుంది. అదే ఇప్పుడు క్రికెట్ ను నడిపిస్తుంది. వారి నుండి మాకు ఏ విధమైన అధిక లాభాలు అనేవి కలగడం లేదు.
Advertisement
ఒకవేళ ఐసీసీ బీసీసీఐకి సహకరిస్తుంది అంటే ఎలా సహకరిస్తుంది అనేది నిరూపించింది అని ఛాలెంజ్ చేసాడు బిన్నీ. అలాగే ఇండియా జట్టు అనేది పెద్దది అనడంలో సందేహం లేదు. కానీ మాకు ఎటువంటి ప్రయోజనాలు అనేవి రావడం లేదు అని బిన్నీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం క్రికెట్ లో మన బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు. అలాగే ఐసీసీకి వచ్చే లాభాలలో కూడా మన వద్ద నుండే 70 శాతంకు పైగా వెళ్తాయి. అందుకే పాక్ ఫ్యాన్స్ ఐసీసీ మనకు సహకరిస్తుంది అని భ్రమ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి :