బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అయితే ఐపీఎల్ ఆదరణ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది కూడా ఐపీఎల్ దూసుకపోతుంది. ఇంకా రెండు కొత్త జట్లు రావడంతో అభిమానులకు మరింత ఆందని పంచుతుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతున్న వేళా మరో వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది.
Advertisement
ఈ ఏడాదితో ఐపీఎల్ 15 ఏళ్ళు పూర్తి చేసుకోనుండటంతో ఐపీఎల్ 2022 ఫైనల్ కు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఈ మధ్యే కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 83 సినిమాలో నటించిన హీరో రణ్ వీర్ సింగ్ ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆస్కార్ అవార్డు సాధించిన ఎఆర్ రెహ్మాన్ తో కూడా మ్యూజిక్ కు సంబంధించిన ఓ ప్రోగ్రాంను ఫైనల్స్ లో నిర్వహించాలని చూస్తుంది బీసీసీఐ.
Advertisement
ఇక అదే విధంగా భారత క్రికెట్ అంచెలంచెలుగా ఎదగడానికి సహాయపడిన భారత మాజీ కెప్టెన్లను సన్మానించనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే స్వతంత్రం సాధించి 75వ ఏళ్ళు పూర్తి చేసుకున్న ఘనతకు గుర్తుగా ఈ 75 ఏళ్లలో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ లుగా వ్యవరించిన అందరికి ఈ ఫైనల్స్ నాడు సన్మానం చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఐపీఎల్ 2022 ఫైనల్స్ మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?
గోల్డెన్ డక్ నవ్వు పై కోహ్లీ వ్యాఖ్యలు…!