Ad
కరోనా కారణంగా బయో బాబుల్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 ముగిసిపోయింది. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పాడగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ ను ఎగురేసుకుపోయింది. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లీగ్ మ్యాచ్ లు మొత్తం ముంబైలోని నాలుగు స్టేడియాల్లోనే నిర్వహించింది బీసీసీఐ. వాంఖడే, డీవై పాటింగ్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ,బ్రాబోన్, పూణే క్రికెట్ స్టేడియాల్లోనే మొత్తం 72 లీగ్ మ్యాచ్ లు నిర్వహించారు.
అలాగే ప్లే ఆఫ్స్ ప్రారంభమైన తర్వాత క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లను కోల్కతా లో నిర్వహించిన బీసీసీఐ.. క్వాలిఫైర్ 2 అలాగే ఫైనల్స్ ను గుజరాత్ లోనే నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించింది. అయితే గ్గతా ఏడాది కరోనా కాటుకు గురైన ఐపీఎల్ ను ఈ ఏడాది మాత్రం చాలా సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది బీసీసీఐ. ఇక ఈ మ్యాచ్ ల ఇంత విజయ వంతం కావడానికి క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బంది కూడా ప్రధాన కారణం. పార్థి మ్యాచ్ కు పిచ్ ను, గౌండ్ ను తయారు చేయడానికి వారు పడిన కష్టాన్ని గుర్తించిన బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
తాజాగా ఈ విషయం పై బీసీసీఐ సెక్రెటరీ జై షా తన ట్విట్టర్ వేదికగా… ఈ ఐపీఎల్ లో మనం హై ఓల్టేజీ మ్యాచ్ లను చూసాం. ఇంధికోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదలు తెలుపుతున్నా. అయితే ఈ మ్యాచ్ లు విజయ వంతంగా నిర్వహించడానికి క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. అందుకే లీగ్ మ్యాచ్ లు జరిగిన… సీసీఏ, వాంఖడే, డీవై పాటిల్, ఎంసీఏ, పూణే స్టేడియాలకి చెందిన క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బందికి చెరో 25 లక్షలు… అలాగే ప్లేఆఫ్స్ జరిగిన ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాల క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బందికి చెరో రూ.12.5 లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తున్నాం. మొత్తం రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీ మా హీరోలకు అందిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్న” అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
ఈ ఐపీఎల్ లో బట్లర్ సంపాదన ఎంతో తెలుసా…?
కోహ్లీ 110 సెంచరీలు చేస్తాడు..!
Advertisement