Home » తులసి మొక్కను ఈ దేవుళ్లకు దగ్గరగా అస్సలు పెట్టకూడదు.. కారణం..!!

తులసి మొక్కను ఈ దేవుళ్లకు దగ్గరగా అస్సలు పెట్టకూడదు.. కారణం..!!

by Sravanthi
Ad

భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. ఇక్కడి ప్రజలు ఎక్కువగా గుల్లు,గోపురాలు, దేవుళ్ళు,జాతకాలు అంటూ నమ్ముతూ ఉంటారు. చెట్టు నుంచి మొదలు పుట్ట వరకు అన్నింటినీ దేవుడిగా కొలుస్తారు. ముఖ్యంగా తులసి మొక్కకు అయితే చాలా పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి తులసి మొక్కను ఆ దేవుడికి దగ్గరగా అసలు పెట్టకూడదట.. కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

also read:కృష్ణ సొంత ఊరైన బుర్రిపాలెంలో పెద్దకర్మకు అడ్డు చెప్పింది ఆవిడేనా..?

Advertisement

తులసి మొక్కను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి మొక్క అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. దాదాపుగా ప్రతి హిందూ కుటుంబంలో ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంటి ఆవరణలో ఏ విధంగా పెడితే ఎక్కడ పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడు కూడా భూమిపై నాటవద్దు. మట్టి కుండా లేదా బకెట్ లాంటి వస్తువులలోనే తులసి మొక్కలు నాటాలి. ఉదయం లేచిన వెంటనే తులసి మొక్కను చూస్తే చాలా మంచిదనీ అంటుంటారు.

Advertisement

ముఖ్యంగా తులసి మొక్కను శివుడి విగ్రహానికి దగ్గరగా ఉంచకూడదట. అంతేకాకుండా గణేష్ విగ్రహానికి కూడా దగ్గరగా ఉంచకూడదట. శివుడు మరియు గణేశుడు పూజలోను తులసి ఆకులను వాడరాదు. అంతేకాకుండా ఇంటి పైకప్పు పై కూడా తులసి మొక్కను ఉంచరాదు. ఇంటి పై కప్పు పై తులసి మొక్కను ఉంచడం ద్వారా ఎండ తుఫాన్ వానలకు అది కింద పడిపోవడం జరుగుతుంది. అలా తులసి మొక్కకు హాని జరిగితే ఆ కుటుంబానికి కూడా మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading