ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సౌత్ ఇండియా లోనే స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రజనీకాంత్. ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ తన మేనరిజం, నటనతో స్టార్ హీరోగా మారిపోయారు. ఇక రజనీకాంత్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో భాషా సినిమా కూడా ఒకటి. ఈ సినిమానే రజనీకాంత్ కు సౌత్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో లో ముంబై ని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారతాడు.
READ ALSO : కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?
Advertisement
ఎందుకు ఆటోడ్రైవర్ గా మారాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాను మొదట తమిళ్ లో తీశారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. తమిళ్ లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను నిర్మాతలు తెలుగులో కూడా డబ్ చేయాలని అనుకున్నారు. కానీ సురేష్ కృష్ణ తెలుగులో సినిమాను రీమేక్ చేయాలనుకున్నాను. అంతే కాకుండా ఈ చిత్రాన్ని బాలకృష్ణ లేదా చిరంజీవి లతో రీమేక్ చేయాలని అనుకున్నారు.
Advertisement
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…
ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్స్ కోసం బాషా నిర్మాతలు దేవీ శ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారట. కానీ మన హీరోలకు ఈ సినిమా అంతగా నచ్చలేదట. ఇక బాలకృష్ణ రీమేక్ లకు దూరంగా ఉండేవారు. ఈనేపథ్యంలో బాషా సినిమాలో అవకాశం వచ్చినా లైట్ తీసుకొన్నారు. ఒకవేళ బాలయ్య ఒప్పుకుని ఉంటే బాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది. మరి బాలయ్య బాషా చేసి ఉంటే ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. అటు చిరంజీవి కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. మంచిగా హిట్ మూవీని మిస్ చేసుకున్నట్లైంది.
READ ALSO : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు టికెట్ ధరలు..టైమింగ్స్ ఇవే