Home » పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కనే బెటర్.. RGV ట్వీట్ వైరల్!

పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కనే బెటర్.. RGV ట్వీట్ వైరల్!

by Anji
Ad

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగనున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.  నవంబర్ 28 సాయంత్రం 5 గంటల కంటే ముందు వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలు జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ప్రచారం చేశారు. పలువురు బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని చేశారు. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.

Advertisement

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా  పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శించారు. ఇంతకంటే ఎక్కువ నిరాసక్తమైన మరియు అజాగ్రత్త ప్రచారాన్ని ఎప్పుడూ చూడలేదు అని.. పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే ఉన్నారు. అతను మాట్లాడుతున్న మైక్ సౌండ్ గురించి కూడా అతను లేదా నిర్వాహకులు బాధపడటం లేదు. అతనితో పోలిస్తే బర్రెలక్క చాలా మెరుగ్గా ఉంది అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ కంటే కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీష బెటర్ అంటూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అర్జీవికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.  అసలే పవన్ కళ్యాణ్ కి , ఆర్జీవీకి అసలే పడదు. ఆర్జీవీ వైసీపీకి మద్దతు ఇస్తుంటాడు. నిత్యం పవన్ కళ్యాణ్ పై ఓ సినిమా కూడా తీస్తున్నట్టు సమాచారం. వీరిద్దరికీ వివాదాలు జరుగుతున్న సమయంలోనే ఆర్జీవీ పవన్ కళ్యాణ్ ని తెలంగాణ ఎన్నికల వేళ గెలికి తప్పు చేశారంటూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు స్పందిస్తున్నారు. పవన్ అభిమానులకు ఆర్జీవీ సమాధానం చెబుతాడో లేక మరో సెటైర్ వేస్తాడో వేచి చూడాలి మరీ.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading