తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొన్ని ఏడవ సీజన్లోకి అడుగు పెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ షో ఎప్పుడు ఎప్పుడు మొదలగుపోతుందా అంటూ బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి కేవలం సెలబ్రిటీలకే కాకుండా సామాన్లు కూడా ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది బాగా పాపులారిటీని సంపాదించుకోగా మరి కొంతమంది బోలెడంత నెగిటివిటీని మూట కట్టుకొని హౌస్ నుంచి బయటికి వచ్చారు.
Advertisement
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే సెలబ్రిటీలు వీళ్లే అంటూ కొంతమంది పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. ఇక ఆ కోవలోనే ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి సుపరిచితురాలు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రెండు మూడు నెలలలోనే తన గలగల మాటల ప్రవాహంతో ఒక మిలియన్ సుబ్క్రైబర్ని ఆకట్టుకోగలిగింది. ఆమె ఇంకెవరో కాదు.. బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా థాయ్‌లాండ్ దేశంలోని వీధికొట్టు దగ్గర నుంచి వింత ప్రదేశాల వరకు అన్నింటినీ వీడియోలు చేసి జనాలకు చూపిస్తూ ఉంటుంది. ఆమె అసలు పేరు శ్రావణి సమంతపూడి.
Advertisement
ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ కి రెండు మిలియన్లకు పైగా సబ్ స్కెబర్లు ఉన్నారు. విజయనగరానికి చెందిన శ్రావణి బ్యాంకాక్‌లో కూడా తన యాసభాషలను వదిలిపెట్టలేదు. విదేశాల్లోనూ చక్కగా మన యాస మాట్లాడుతుండటంతో ఎంతోమంది ఈమె మాట్లాడే విధానానికి ఫిదా అయిపోయారు. ఈమె ఒక్క వీడియో పోస్ట్ చేసిందంటే క్షణాల్లో మిలియన్స్ అఫ్ వ్యూస్ దక్కించుకుంటుంది. ఈ వారంలో ఆమె పోస్ట్ చేసిన వీడియోలో మేము కుటుంబంతో సహా ఇండియాకు వచ్చేస్తున్నామంటూ వెల్లడించింది.
ఆమె అలా చెప్పడంతో శ్రావణి బిగ్‌బాస్ కు వచ్చే ఛాన్స్ ఉందేమో అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బ్యాంకాక్ పిల్ల లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. అంతే కాకుండా బ్యాంకాక్ పిల్ల మాటల ప్రవాహానికి బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్లే. ఈ వార్తలో నిజం ఎంత అనేది బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం అయ్యేవరకు వేచి చూడాల్సిందే..
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Takkaridonga : టక్కరి దొంగ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే?
బేబీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య..! ఎందుకంటే..?
సమంత సంచలన పోస్ట్.. సినిమాలకు ఇక దూరం కానుందా ?