Home » వాసి వాడి తస్సదియ్యా… బంగార్రాజు ట్రైలర్ వచ్చిందయ్యా…!

వాసి వాడి తస్సదియ్యా… బంగార్రాజు ట్రైలర్ వచ్చిందయ్యా…!

by AJAY
Ad

మన్మధుడు నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించగా …నాగచైతన్య కు జోడిగా కృతి శెట్టి నటించింది. అంతే కాకుండా మరో ఆరుగురు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

Advertisement

Bangarraju trailer

Bangarraju trailer

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు పాటలను విడుదల చేసిన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైలర్ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. కామెడీ యాక్షన్, మాస్ సీన్లతో కలర్ ఫుల్ గా ట్రైలర్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading