Home » మేధావిలా న‌టిస్తాడంటూ బండ్ల‌గ‌ణేష్ ట్వీట్…ఆ ద‌ర్శ‌కుడినేనా..?

మేధావిలా న‌టిస్తాడంటూ బండ్ల‌గ‌ణేష్ ట్వీట్…ఆ ద‌ర్శ‌కుడినేనా..?

by AJAY
Ad

బండ్ల గ‌ణేష్ ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టాలీవుడో ఒకప్పుడు క‌మెడియ‌న్ గా రానించిన బండ్ల గ‌ణేస్ ఆంనేయులు సినిమాతో నిర్మాత‌గా మారారు. ఆ త‌రవాత చాలా సినిమాల‌కు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. కానీ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా మాత్రం బండ్ల గ‌ణేష్ కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత‌నే బండ్ల గ‌ణేష్ నిర్మాత అన్న సంగ‌తి చాలా మందికి తెలిసింది.

Advertisement

Advertisement

అయితే సినిమాల కంటే బండ్ల గ‌ణేష్ టీవీ ఇంట‌ర్వ్యూలు మ‌రియు సినిమా ఈవెంట్ ల‌లో స్పీచ్ ల‌తోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక కొంత‌కాలంగా బండ్ల గ‌ణేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ట్వీట్ లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాల పై మాత్ర‌మే కాకుండా రాజ‌కీయ సామాజిక అంశాల‌పై కూడా బండ్ల ట్వీట్ లు చేస్తుంటాడు. అంతే కాకండా ఆ ట్వీట్ ల వ‌ల్ల వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక తాజాగా బండ్ల గ‌ణేష్ చేసిన మరో ట్వీట్ కూడా హాట్ టాపిక్ గా మారింది.

బండ్ల గ‌ణేష్ త‌న ట్వీట్ లో… మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా…అంటూ రాసుకు వ‌చ్చాడు. ఇక బండ్ల ట్వీట్ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ గురించే అంటూ కొంత‌మంది నెటిజ‌న్ లు ట్వీట్ లు చేస్తున్నారు.

Visitors Are Also Reading