Home » క‌థ, స్క్రీన్ ప్లే అంతా సీఎం ఆఫీస్ నుంచే జ‌రిగింది : బండి సంజ‌య్

క‌థ, స్క్రీన్ ప్లే అంతా సీఎం ఆఫీస్ నుంచే జ‌రిగింది : బండి సంజ‌య్

by Anji
Ad

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నివాసంపై దుండ‌గులు రాళ్లు రువ్విన సంగ‌తి తెలిసిన‌దే. ఈ నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మాట్లాడుతూ.. క‌థ‌, స్క్రీన్ ప్లే అంతా సీఎం ఆఫీస్ నుంచే జ‌రిగింద‌ని పేర్కొన్నారు. సినిమా విడుద‌ల కాకముందుకు కథ అడ్డం తిరిగింది. కొంద‌రూ ఐపీఎస్‌లు అధికారుల తీరును చూసి కింది స్థాయి పోలీసులు అస‌హించుకుంటున్నార‌ని తెలిపారు. సీఎంకు కొమ్ముకాస్తూ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ బ‌ల‌వుతారు. వారిని సీఎం కాపాడుతారా అని ఆయ‌న అన్నారు.

Advertisement

జితెంద‌ర్‌రెడ్డి కేసీఆర్ ద‌గ్గ‌ర ఉన్నాడు. ఎంత మంది హ‌త్య‌కు కుట్ర చేశారో సీఎం చెప్పారు. డీకే అరుణ, జితేంద‌ర్‌రెడ్డిలపై త‌ప్పుడు క‌థ‌నాలు రావ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. వాళ్ల ఇళ్ల మీద దాడులు చేశారు. కేసులో వారిద్ద‌రి పేర్లులేవు. ఆరోప‌ణ‌లు చేసిన టీఆర్ఎస్ నాయ‌కులు, త‌ల‌కాయ‌లు ఎక్క‌డ పెట్టుకుంటారు. హ‌త్య, రాజ‌కీయాల‌ను బీజేపీ స‌మ‌ర్థించ‌ద‌ని ఆయ‌న స్ప‌స్టం చేశారు. ఈ రోజు రిమాండ్ చేయ‌బ‌డ్డ వారు త‌మ‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు గ‌తంలో పిర్యాదు చేశార‌న్నారు.

Advertisement

Also Read :  IND vs SL : భార‌త్‌-శ్రీ‌లంక తొలి టెస్ట్ ఎంత ప్ర‌త్యేక‌మో తెలుసా..?

Visitors Are Also Reading