90sలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. ఈ నలుగురు హీరోలు స్టార్ హీరోల స్థానంలో ఉండడంతోపాటు ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నారు.
Advertisement
అయితే ఈ నలుగురు హీరోలు కూడా పోలీస్ పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ వారిలో ఒక్క హీరో మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ హీరో ఎవరు..? వీళ్లు చేసిన సినిమాలు ఏవి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మన్మధుడు నాగార్జున 1991లో ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్ణయం అనే సినిమా చేశారు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా ఆయనకు భార్యగా అమల నటించింది. అయితే ఈ సినిమా కథాంశం గందరగోళంగా ఉండడంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయలేకపోయింది. దాంతో ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా 1994లో సూపర్ పోలీస్ అనే సినిమా వచ్చింది. మురళీమోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో వెంకటేశ్ కు జోడీగా సౌందర్య నగ్మా హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎస్పి పరశురాం అనే సినిమా తెరకెక్కింది. 1994లో ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. అంతేకాకుండా కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగులో శ్రీదేవి నటించిన చివరి సినిమా కూడా ఇదే. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తెరకెక్కింది. 1992లో ఈ సినిమా విడుదలైంది. సినిమాలో బాలకృష్ణకు జోడీగా విజయశాంతి హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు. సినిమాకు పుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ప్లస్ అయ్యాయి. బాలయ్య డైలాగులతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. సినిమాకు బప్పీ లహరి ఇచ్చిన పాటలు కూడా ఈ సినిమా అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలా నలుగురు హీరోల పోలీస్ పాత్రల పోటీ లో బాలయ్య నెగ్గారు.
Also read :
సినిమాలతోనే కాదు అప్పట్లో తన సీరియల్ తోనూ సంచలనాలు సృష్టించిన జక్కన్న..!
నాగార్జున రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!