Home » ఐదు నిమిషాల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన బాలయ్య.. ఎలా అంటే..!!

ఐదు నిమిషాల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన బాలయ్య.. ఎలా అంటే..!!

Ad

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా అంటే టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలన్నది తెలిసిందే. బాలయ్య ప్రతి సినిమా టైటిల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ కి సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. రౌడీయిజం, జై బాలయ్య, వీర నరసింహారెడ్డి మరికొన్ని టైటిల్స్ ఈ సినిమాకి సంబంధించి వినిపించాయి. టైటిల్స్ బాగానే ఉన్నా మేకర్స్ మాత్రం వీటి గురించి క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈ సినిమా మేకర్స్ తాజాగా ఈ సినిమాకి అన్నగారు అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి సినీ అభిమానులు, రాజకీయ అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ ని అన్నగారు అని పిలిచేవారు.

Advertisement

బాలయ్య సినిమాకి ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు సైతం అనుకుంటున్నారు. త్వరలో ఈ టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలయ్యను ఏ విధంగా చూపించబోతున్నారో ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ద్వారా ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. బాలయ్య, శ్రుతిహాసన్ కాంబినేషన్ సీన్ లు ఈ సినిమాకి హైలైట్ గా నిలువనున్నాయని సమాచారం. శృతి ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటుంది.

Advertisement

సీనియర్ హీరోలకు జోడిగా వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది శృతిహాసన్. సెకండ్ ఇన్నింగ్స్ లో శృతిహాసన్ కెరియర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. క్రాక్ సినిమా సక్సెస్ శృతి హాసన్ కెరియర్ కి కొంతమేర ఉపయోగపడిందని తెలుస్తోంది. శృతిహాసన్ మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బాలయ్య,శృతి హాసన్ మూవీ బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది వేచి చూడాలి. మరోసారి అలాంటి అద్భుతమైన హిట్ గోపీచంద్ మలినేని అలాగే శృతిహాసన్ తీసుకొస్తారేమో చూడాలి.

Visitors Are Also Reading