వారిద్దరూ బాలనటీనటులుగానే తమ సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 1970లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన మా నాన్న నిర్దోషి అనే తెలుగు మూవీలో శ్రీదేవి బాలనటిగా నటించింది. ఆ తరువాత నేను మనిషినే, విధి విలాపం, బడిపంతులు వంటి సినిమాల్లో బాలనటిగా నటించిన తరువాత 1978లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన పదహారేళ్ల వయసు సినిమాలో హీరోయిన్‌గా నటించింది శ్రీదేవి. వేటగాడు, మోసగాడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, బెబ్బులి పులి, ప్రేమాభిషేకం, కిరాయి కోటిగాడు, దేవత లాంటి సినిమాల్లో నటిస్తూనే అకస్మాత్తుగా ఉత్తరాది సినిమాల్లోకి వెళ్లిపోయింది.
Advertisement
ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. 1974లో వచ్చిన తాతమ్మకల చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత రామ్ రహీం, అన్నదమ్ముల అనుబంధం, మంగమ్మగారి మనవడు, భలేదొంగ, ముద్దుల కృష్ణుడు, ముద్దుల మామయ్య లాంటి సినిమాల్లో నటించారు బాలకృష్ణ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో నటించిన శ్రీదేవి బాలకృష్ణతో కలిసి నటించలేదు. ఈ విషయంపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
Advertisement
1987లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలకృష్ణ, శ్రీదేవితో సామ్రాట్ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఆ తరువాత 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలేదొంగ సినిమాలో కూడా శ్రీదేవిని హీరోయిన్‌గా అనుకున్నారు. హిందీలో శ్రీదేవి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల రెండు సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. ఇక రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత ఈ రెండు సినిమాల్లో ఒకే ఫ్రేమ్‌లో బాలకృష్ణ-శ్రీదేవి కనిపించినప్పటికీ ఇద్దరూ ఒకే జోడీగా మాత్రం ఏ సినిమాలో కనిపించలేదు. శ్రీదేవి-బాలకృష్ణ జంటగా అవకాశం వచ్చినా అది కుదరలేదు. ఈ కాంబినేషన్ మొత్తానికి నటించలేదనే చెప్పవచ్చు.
Also Read :
జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణలు రాజకీయాల్లో వైఫల్యం చెందడానికి కారణాలు అవేనా..?
శ్రీదేవి పెట్టిన కండిషన్స్ వల్ల ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఏంటో తెలుసా..?