Home » బాల‌య్యకు సెంటిమెంట్ అక్ష‌రం ఏంటో తెలుసా…ఆ అక్ష‌రంతో టైటిల్ ఉంటే బొమ్మ బ్లాక్ బ‌స్టరే..!

బాల‌య్యకు సెంటిమెంట్ అక్ష‌రం ఏంటో తెలుసా…ఆ అక్ష‌రంతో టైటిల్ ఉంటే బొమ్మ బ్లాక్ బ‌స్టరే..!

by AJAY
Ad

కొంత‌మంది జాత‌కాల‌ను, ముహూర్తాల‌ను ఎక్కువ‌గా న‌మ్ముతూ ఉంటారు. వాళ్ల‌కు అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రుగుతాయి కాబ‌ట్టి వారు అలా న‌మ్ముతారు. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. అలాగే కొంత‌మందికి కొన్ని సెంటిమెంట్ లు ఉంటాయి. ప‌లానా నంబ‌ర్ తో వాహనం కొంటే మంచి జ‌రుగుతుంది. ఫ‌లానా రంగు వేసుకుంటే మంచి జ‌రుగుతుంది. ఇలా ఒక్కొక్క‌రూ ఒక్కోర‌కంగా న‌మ్ముతారు.

Advertisement

 

అయితే న‌ట‌సింహం నంద‌మూరి బాలయ్య‌కు కూడా అలాంటి ఒక సెంటిమెంట్ ఉందట‌. బాల‌య్య కూడా ముహూర్తాల‌ను ఎక్కువగా విశ్వ‌సిస్తూ ఉంటారు. సినిమా మొద‌లు పెట్టాల‌న్నా సినిమా విడుద‌ల చేయాల‌న్ని క‌చ్చితంగా ముహూర్తం చూస్తారు. అనుకున్న స‌మ‌యానికే సినిమాను విడుద‌ల చేస్తారు. అంతే కాకుండా బాల‌య్య టైటిల్స్ విష‌యంలో కూడా కొన్ని సెంటిమెంట్ ల‌ను ఫాలో అవుతార‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

సినిమా టైటిల్ లో సింహా వ‌చ్చిందంటే ఈ సినిమా ప‌క్కా హిట్ అంతే…సింహా, న‌ర‌సింహనాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా మ అనే అక్ష‌రం కూడా బాల‌య్య‌కు చాలా సెంటిమెంట్….బాల‌క్రిష్ణ హీరోగా న‌టించిన ముద్దుల మామ‌య్య‌, ముద్దుల కృష్ణ‌య్య‌, ముద్దుల మేన‌ల్లుడు, మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి.

Also Read: వీలునామా ని రాసేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేస్తే అవి చిత్తు కాగితంతో స‌మానం అని మీకు తెలుసా..?

అయితే ఇప్పుడు బాల‌య్య మ‌రోసారి మ అనే అక్ష‌రం తో మొద‌ల‌య్యే టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. బాల‌కృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ గా మోనార్క్ ప‌రిశీల‌న‌లో ఉంది. లేదంటే టైటిల్ సింహా వ‌చ్చేలా టైటిల్ ఉండే అవ‌కాశం కూడా ఉంది. మరి ఈ సినిమా బాల‌య్య‌కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Also Read: అభిమానుల అంచ‌నా ప్ర‌కార‌మే హీరోలు ఉండాలా..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై గ‌రిక‌పాటి ఫైర్..!

Visitors Are Also Reading