Balayya : నరసింహ నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ప్రముఖ సినీ హీరో హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. రాజకీయాలతో సినిమాలతో బిజీగా ఉంటూ ఉంటారు. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్నాయి హిందూపురం నియోజకవర్గం నుండి ఇంకోసారి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు బాలయ్య. శుక్రవారం భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలని బాలయ్య సమర్పించారు. ఈ నామినేషన్ డాక్యుమెంట్ల లో ఆస్తుల విలువ కి సంబంధించి విషయాలని పేర్కొన్నారు. బాలయ్య ఆస్తు వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
నందమూరి బాలకృష్ణ ఆస్తులు వివరాల గురించి ఇప్పుడు చూసేద్దాము. నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి నందమూరి తారకరామారావు కొడుకుగా ఎంట్రీ ఇచ్చి 2014లో మొదటిసారి హిందూపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో కూడా మరో సారి గెలిచి సత్తాని చాటారు. నందమూరి కుటుంబం నుండి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడవ సభ్యుడు బాలయ్య ఇక బాలయ్య ఆస్తులు వివరాల్లోకి వెళ్లి పోదాం.. ఎన్నికల ఆఫిడివిట్ లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాలు ప్రకారం, బాలకృష్ణ ఆస్తుల విలువ 81 కోట్ల 63 లక్షలు. బాలయ్య భార్య వసుంధర ఆస్తుల విలువ 140 కోట్ల 38 లక్షల 83 వేలు. ఇక ఆయన కొడుకు మోక్షజ్ఞ ఆస్తుల విలువ వచ్చేసి 58 కోట్ల 63 లక్షల 66 వేలు.
Advertisement
Also read:
Also read:
బాలయ్య అప్పులు 9 కోట్ల 9 లక్షల 22 వేలు. వసుంధర ఆప్పులు 3 కోట్ల 83 లక్షల 98 వేలు. ఈ ఎలక్షన్లు పూర్తయిపోయిన తర్వాత మాస్ డైరెక్టర్ అయినటువంటి బోయపాటి శ్రీనుతో అఖండ టు సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ. అప్పట్లో సూపర్ హిట్ అందుకున్న అఖండ సినిమాకి సీక్వెల్ గా అఖండ టు సినిమా తెరమీదకి రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైపోయాయి. అఖండ లానే అఖండ టు కూడా బాలయ్య కి బోయపాటికి మంచి సక్సెస్ ని ఇస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి బాలయ్య అభిమానులు అనుకుంటున్నట్లే అఖండ 2 సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!