Home » ఆ హీరోయిన్ తో బాల‌య్య సిన్సియ‌ర్ ల‌వ్…కానీ ఎన్టీఆర్, హ‌రికృష్ణ ఏం చేశారంటే..!

ఆ హీరోయిన్ తో బాల‌య్య సిన్సియ‌ర్ ల‌వ్…కానీ ఎన్టీఆర్, హ‌రికృష్ణ ఏం చేశారంటే..!

by AJAY
Ad

ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. నట సింహం గా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంది బాలకృష్ణ మాత్రమే. కేవలం సినిమాల్లోనే కాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఎమ్మెల్యే గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తమ బంధువుల అమ్మాయి అయిన వసుంధర ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే నిజానికి బాలకృష్ణ ఓ మద్రాస్ హీరోయిన్ ను ప్రేమించారట. ఈ విషయాన్ని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు పలు ఇంటర్వ్యూ లల్లో చెప్పారు. ఓ మద్రాస్ హీరోయిన్ ను బాలకృష్ణ ప్రేమించానని అది ఎన్టీఆర్ కు నచ్చకపోవడం తో వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దాంతో తానే కాకినాడ కు చెందిన తమ బంధువుల అమ్మాయి వసుంధర తో వివాహం జరిపించామని పేర్కొన్నారు.

Advertisement

అయితే బాలకృష్ణ సినిమాలకు కాస్ట్యూమ్ విభాగం లో పని చేసిన శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. శ్రీరాపాక బిగ్ బాస్ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన శ్రీరాపాక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…..బాలయ్య చాలా సింపుల్ మనిషి అని చెప్పింది. ఇంట్లో బయట చాలా సింపుల్ గా ఉంటారని తెలిపింది. ఆయనిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడే టైప్ కాదని చెప్పింది. అంతే కాకుండా పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటారని….అప్పట్లో హీరోయిన్ తో లవ్ గురించి తనకు చెప్పారని తెలిపింది.

ఆ హీరోయిన్ ను చాలా సిన్సియర్ గా లవ్ చేసినట్టు బాలయ్య తన తో చెప్పారని పేర్కొంది. ఆ హీరోయిన్ ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని..కానీ ఎన్టీఆర్, హరికృష్ణ కు హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినట్టు తెలిపింది. సంప్రదాయ కుటుంబం నుండి అమ్మాయిని చేసుకుంటే తనను బాగా చూసుకుంటారని వాళ్ళు భావించారని చెప్పినట్టు తెలిపింది. అయితే బాల‌య్య ప్రేమించిన హీరోయిన్ ఎవ‌రన్న‌ది మాత్రం శ్రీరాపాక బ‌య‌ట‌పెట్ట‌లేదు. కానీ అప్ప‌ట్లో బాల‌య్య ఖుష్భూ ప్రేమించుకున్నారని మాత్రం వార్త‌లు చెక్క‌ర్లు కొట్టాయి.

Visitors Are Also Reading