నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాలయ్య తన తదుపరి చిత్రం పై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే బాలయ్య తదుపరి సినిమా క్రాక్ దర్శకుడు గోపీ చంద్ మలినేనితో ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మాస్ ఓరియెంటెడ్ గా రాబోతుంది. ఇక ప్రస్తుతం బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షోకు గెస్టులుగా రవితేజ మరియు గోపిచంద్ మలినేని హాజరయ్యారు.
ఈ సందర్భంగా గోపిచంద్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను బాలయ్య అభిమానిని అని సినిమా టికెట్ల కోసం జరిగిన గొడవలో జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. రవితేజ కూడా ఈ షోలో బాలయ్యతో రచ్చ రచ్చ చేశారు. తన సినిమాలు మరియు నిజజీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను రవితేజ షేర్ చేశారు. ఇదిలా ఉండగా ఈ షోలో గోపించంద్ తో తాను చేయబోయే సినిమా నుండి ఒక డైలాగ్ చెప్పాలని బాలకృష్ణ కోరారు. ఇక హీరోనే కోరడంతో గోపిచంద్ ఒక డైలాగును లీక్ చేశారు. రోడ్డు మీదకు జింక, గొర్రె వస్తే ఎవడైనా హారన్ కొడతాడు.
Advertisement
Advertisement
also read : నాగార్జునకు రోజుకు రెండు పెగ్గులు అలవాటు చేసిన సినిమా!
అదే సింహం వస్తే హారన్ కాదు కదా…ఇంజన్ ఆఫ్ చేసి సైలెంట్ గా ఉంటాడు. అక్కడ ఉంది సింహం రారేయ్…అంటూ గోపిచంద్ డైలాగ్ చెప్పాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొట్టారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ సినిమా బాలయ్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.