Telugu News » నాగార్జున‌కు రోజుకు రెండు పెగ్గులు అల‌వాటు చేసిన సినిమా!

నాగార్జున‌కు రోజుకు రెండు పెగ్గులు అల‌వాటు చేసిన సినిమా!

by Azhar

నాగార్జున‌, నాని జంట‌గా న‌టించిన సినిమా దేవ‌దాస్ .ఈ సినిమాలో నాగ్ దేవ్ క్యారెక్ట‌ర్ ను పోషించాడు. ఎప్పుడూ మందు తాగే ఈ క్యారెక్ట‌ర్ బాగా వ‌చ్చేందుకు నాగార్జున ప్ర‌తిరోజూ రెండు పెగ్గులు తాగి షూటింగ్ వెళ్లేవాడ‌ట‌! అది కాస్త అల‌వాటుగా మారింద‌ట‌, చాలా రోజుల త‌ర్వాత ఆ అల‌వాటు నుండి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని నాగార్జున‌యే స్వ‌యంగా చెప్పుకున్నాడు.

Ads

ఇక ఫిట్ నెస్ విష‌యంలో ప‌క్కాగా ఉంటాన‌ని, తిండి, ఎక్స్ స‌ర్సైజ్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాన‌ని చెప్పాడు నాగ్… ఈ వ‌య‌సులో కూడా ఆ ఫిజిక్ మెయింటేన్ చేయ‌గ‌లుగుతున్నాడంటే దాని వెనుక నాగ్ డెడికేష‌న్ యే కార‌ణం!

ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే…2018 లో రిలీజైన ఈ సినిమా హిట్ గా నిలిచింది. అశ్వినీదత్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకు టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హించారు. 2019లో ఈ సినిమా డాన్ ఔర్ డాక్ట‌ర్ పేరుతో హిందీలోకి డ‌బ్ చేశారు.


You may also like