Home » బాలయ్య “చెన్నకేశవరెడ్డి” మళ్లీ విడుదల..ఎందుకో తెలుసా..?

బాలయ్య “చెన్నకేశవరెడ్డి” మళ్లీ విడుదల..ఎందుకో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి బాలయ్య ఒక స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్నారు. తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు ప్రజల గుండెల్లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నందమూరి బాలయ్య. ఆయన సినీ కెరీర్ లో వచ్చిన చెన్న కేశవ రెడ్డి మూవీ అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.. ఈ మూవీ వివి వినాయక్ దర్శకత్వంలో 2022 సెప్టెంబర్ 25 వ తేదీన థియేటర్లకు వచ్చింది..

ALSO READ:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

మోస్ట్ యాక్షన్ చిత్రంగా అప్పట్లో సంచలన విజయం సాధించింది.. అయితే ఈ మూవీ విడుదలై 20 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంలో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్రయూనిట్.. ఈ విషయంపై చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ గురువారం విలేకర్ల సమావేశంలో తెలియజేశారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ వి.వి.వినాయక్ అప్పట్లో ఈ సినిమాను ప్రేక్షకుల రోమాలు నిక్క పొడిచేలా ప్రతి సీన్ తీర్చిదిద్ది, ఎంతో క్రేజీగా నిర్మించారు. అలాంటి సినిమాను మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

అయితే ఈ సినిమా ఈ నెల 24వ తేదీన ప్రీమియర్స్ మొదలవుతాయని, ఆ తర్వాత25 రోజున రెగ్యులర్ షోలు ఉంటాయని తెలియజేసాడు.. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో 300కు పైగా థియేటర్లలో ప్రదర్శిస్తామని అన్నారు.. అయితే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని 80 శాతం బసవతారకం ట్రస్టుకు, మిగతా అమౌంట్ ను నాకు సంబంధించిన అసోసియేషన్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అన్నారు.. ఒక మంచి కార్యం కోసం ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేస్తున్నామని, కాబట్టి బాలయ్య అభిమానులు ప్రేక్షకులు మళ్లీ మూవీని ఆదరించాలని కోరారు వి.వి.వినాయక్.. ఏది ఏమైనా బాలయ్య చిత్రం మళ్లీ వస్తుందంటే ప్రేక్షకులకు ఎంతో ఆనందంగా ఉంది.

ALSO READ:“కృష్ణ వ్రిందా విహారి” రివ్యూ !

Visitors Are Also Reading