Home » ఎన్నికలు కోసం.. బాలకృష్ణ షూటింగ్స్ ని ఆపేసారా..?

ఎన్నికలు కోసం.. బాలకృష్ణ షూటింగ్స్ ని ఆపేసారా..?

by Sravya
Ad

బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలకృష్ణ ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉంటూ ఎన్నో సినిమాల్లో నటించి హిట్ ని కొట్టేశారు బాలయ్య ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీని ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్చి 1వ తేదీన ప్రకటన విడుదల చేయబోతోంది. ఆ రోజు నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది దీంతో ఎన్నికల బరిలో ఉన్న స్టార్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా షూటింగ్లకి బ్రేక్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య విషయానికి వస్తే.. నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నికల సంఘం ప్రకటనని దృష్టి లో ఉంచుకుని షూటింగ్ షెడ్యూల్ ని మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

తను ఎన్నికల్లో పాల్గొంటున్నందున ఆ రోజు తో షూటింగ్ కార్యక్రమాలు అన్నిటిని కూడా నిలిపివేయాలని బాలయ్య చూస్తున్నట్లు టాక్ వినపడుతోంది. ఎన్నికల సంఘం ఎన్నికల ని ప్రకటించిన రోజు నుండి అన్ని కార్యకలాపాలని నిలిపివేయాలని ఆయన చూస్తున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెర మీదకి రాబోతోంది. బాలయ్య మరో 10 రోజుల పాటు షూటింగ్లో పాల్గొబోతున్నారు.

అటుపై ఎన్నికల కోసం బాలయ్య 100% ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఆయన తిరిగి సెట్స్ పైకి రావడానికి బాబి అతని బృందం అదనంగా ఇంకో రెండు నెలలు ఎదురు చూడాలి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు ఎలక్షన్ బ్రేక్ తో సినిమాని అనుకున్న విధంగా రిలీజ్ చేయాలంటే దర్శకుడు కాస్త పెద్ద ప్లానే వేసి టైం కి సినిమాని పూర్తి చేయాలి మరి బాలయ్య సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి షూటింగ్ పనులను ఎలా పూర్తి చేస్తారు అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading