నందమూరి నటసింహం బాలకృష్ణ,మాస్ మహారాజా రవితేజ మధ్య గతంలో చాలా సార్లు ఆసక్తికర పోటీ జరిగింది. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి సినిమాలు పోటీ పడినప్పటికీ ప్రతిసారి రవితేజనే పై చేయి సాధించేవారు. కానీ ఇక ఈ సారి సీన్ రివర్స్ అయింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు దసరా కానుకగా అక్టోబర్ 19, 20 తేదీల్లో విడుదలయ్యాయి.
Advertisement
అయితే భగవంత్ కేసరి మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీకి ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ 3 గంటల నిడివి ఉండటం.. ఫస్ట్ హాప్ లో అవసరం లేని లవ్ ట్రాక్ ఉండటంతో ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్యకి భగవంత కేసరి మూవీతో హ్యాట్రిక్ దక్కింది.
Advertisement
రావణాసురతో డిజాస్టర్ చవిచూసిన రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ వచ్చి చేరింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ అయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కకపోవడం, నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై దెబ్బ పడిందనే చెప్పాలి. మొత్తానికి బాలయ్య భగవంత్ కేసరి దసరా రేసులో విన్నర్ గా నిలిచినందుకు నందమూరి అభిమానుల్లో ఆనందం కనిపిస్తోంది. రెండు రోజులుగా దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన భగవంత్ కేసరి మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.