Home » బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

by Bunty
Ad

బాలకృష్ణ, రవితేజ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు. ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరిస్తారు. వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ రవితేజ… బాలకృష్ణ వీరిద్దరికీ అస్సలు పడదు. రవితేజ పై బాలకృష్ణ చేయి చేసుకున్నాడు. అందుకే వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు అనేది ఎప్పటి నుంచో వస్తున్న టాక్. కానీ నిజానికి వీరిద్దరి మధ్య అంత పెద్ద గొడవలు జరిగాయా అనేది తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే…. నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి మాటకారి. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి మనస్తత్వం.

Advertisement

బాలయ్య కొడతారు అనే విషయం చాలామందికి తెలుసు. ఈయన సెట్స్ లోను, బయట జనాల్లోనూ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ వార్తలకి తెర దించుతూ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న షో కి రవితేజ గెస్ట్ గా వచ్చాడు. ఈ ప్రోగ్రాం లో ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ స్టాపబుల్ షో రైటర్ కి పివీఎస్ రవి ఈయన ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. నేను రవితేజ గత 20 ఏళ్ల నుంచి మంచి స్నేహితులం. మేమిద్దరం ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ నాకు రవితేజ చెప్పనేలేదు. బాలకృష్ణ, రవితేజ ఇద్దరూ చాలాసార్లు కలిసి మాట్లాడుకున్నారు.

Advertisement

వారిద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన ఈవెంట్లు చాలానే ఉన్నాయి. నిజంగా బాలకృష్ణ… రవితేజను కొడితే వారిద్దరూ అంత క్లోజ్ గా ఉండేవారు కాదు కదా… మేము రవితేజను ఎపిసోడ్ పిలవాలని అనుకున్నప్పుడు ఆ మ్యాటర్ లీక్ అయింది. దీంతో వీరిద్దరికి పడదని, రవితేజ షో కి రాడని చాలామంది కామెంట్లు చేశారు. ఇక రవితేజని ఈ షో కి పిలుద్దామని బాలకృష్ణకి చెప్పగానే… బాలకృష్ణ వెంటనే నా దగ్గర రవితేజ నంబర్ ఉంది. నేను కాల్ చేసి చెప్తాను అని అన్నాడు. ఇక రవితేజ వద్దకు వెళ్లి షో గురించి చెబితే ఆయన కాస్త బిజీగా ఉండడంతో నా టైం చూసుకుని నేనే వస్తాను అని చెప్పాడు. అప్పటికే రవితేజ 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ బాలకృష్ణ పిలిచారు అని పిలవడంతో తప్పకుండా వస్తాను అని చెప్పారు. చెప్పిన విధంగానే బాలకృష్ణ షోకి రవితేజ వచ్చి చాలా సందడి చేశారు. చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు.

ఇవి కూడా చదవండి 

కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా…ఏది ముట్టుకున్నా నాశనమే ?

అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Samantha : అమెరికాలో కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్ సమంత ?

Visitors Are Also Reading