నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అన్నగారు ఎన్టీరామారావు మాదిరిగానే బాలయ్య కమర్షియల్ సినిమాలతో పాటూ జానపద, పౌరాణిక సినిమాల్లో నటించాడు. అలా బాలయ్య తన కెరీర్ లో నటించిన జానపద చిత్రం భైరవద్వీపం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో బాలయ్య తన నటనతో ఆకట్టుకున్నారు.
Advertisement
బి వెంకటరామిరెడ్డి బృందావనం సినిమా తరవాత ఓ జానపద చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. బాలయ్యతో ఆ సినిమా చేస్తే బాగుంటుందని భావించి సంప్రదించారు. ఇక బాలయ్య కథ వినకుండానే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు నటుడు రావి కొండల రావు కథను అందించారు. కథలో ఎన్నో ట్విస్ట్ లను జోడించారు. ఇక కథ విన్న తరవాత నిర్మాతలు శబాష్ అన్నారు.
Advertisement
బాలయ్య కూడా కథ వినకుండానే విజయ నిర్మాణ సంస్థపై ఉన్న నమ్మకంతో కాల్ షీట్స్ ఇచ్చారు. పాతాల భైరవి సినిమా టైటిల్ లో నుండి భైరవి అనే పేరును తీసుకుని భైరవద్వీపం అని టైటిల్ పెడితే భాగుంటుందని రావికొండల రావు భావించారు. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పగా వాళ్లు కూడా ఓకే అన్నారు. సినిమాలో రాజకుమారి పాత్రకు రోజాను ఎంపిక చేశారు. అంతే కాకుండా స్పెషల్ సాంగ్ కోసం రంభ ను ఒప్పించారు. అలా సినిమా కాస్ట్ మొత్తాన్ని ఎంపిక చేశారు.
ఇక ఈ చిత్రంలో రాజ్ కుమార్ ను మాంత్రికుడి పాత్రలో ఎంపిక చేసుకున్నారు. రాజ్ కుమార్ అప్పటికే మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. సినిమాలో ఆయన గెటప్ ఎంతగానో ఆకట్టుకుంది. తరవాత భైరవద్వీపం సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ 4 కోట్లతో అప్పట్లో సినిమాను నిర్మించగా 1994 ఎప్రిల్ లో విడుదల చేశారు. ఈ సినిమా 59 థియేటర్ లలో వందరోజులు ఆడి అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది.