Home » అంద‌రి ముంద‌టే భార్య‌కు ఐల‌వ్‌యూ చెప్పిన బాల‌య్య..!

అంద‌రి ముంద‌టే భార్య‌కు ఐల‌వ్‌యూ చెప్పిన బాల‌య్య..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో బాల‌కృష్ణ అంటే.. కోపం.. కోపం వ‌స్తే ఎదుటి వాడి చెంప ప‌గులుతుంద‌నేది మాత్ర‌మే తెలుసు. ఆయ‌న చిన్న పిల్ల‌వాడి మాదిరిగా ఎలాంటి క‌ల్మ‌శం లేని వ్య‌క్తి అని కూడా తెలుసు. కానీ బాల‌కృష్ణ‌లో చిలిపి కృష్ణుడు ఉన్నాడ‌నే విష‌యం మాత్రం అల్లు అర‌వింద్ ఆహా ఓటీటీ అన్‌స్టాప‌బుల్ బ‌య‌ట‌పెట్టింది. టాక్ షోలకెల్ల నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు ఇప్ప‌టి వ‌ర‌కు 7 ఎపిసోడ్‌ల‌ను స‌క్సెస్ పూర్తి చేసుకుంది. లెటెస్ట్ ఎపిసోడ్‌కు రానా ద‌గ్గుబాటి గెస్ట్‌గా రాబోతున్నాడు. ర‌వితేజ‌, బాల‌య్య ఎపిసోడ్ నిజంగానే అన్‌స్టాబుల్‌గా అద‌ర‌గొట్టింది.

 

Nandamuri Balakrishna: Oops, Balayya did it again! | Telugu Movie News -  Times of India

Advertisement

 

ఇక రానా ఎపిసోడ్ ప్రోమో వ‌చ్చేసింది. రానా రాగానే ఏమ‌య్య బాల‌య్య టాక్ షో చేస్తున్నాడ‌న‌గానే ఏమ‌నిపించింది అని అడ‌గ‌గా.. ప్ర‌తీ సీజ‌న్ మీరు వ‌చ్చిన ఎపిసోడ్ నెంబ‌ర్ వ‌న్ అని చెప్పాడు రానా. దానికి బాల‌య్య‌కూడా పంచ్ వేశాడు. ఇక్క‌డ బాల‌కృష్ణ అంటేనే నెంబ‌ర్ వ‌న్ అంటూ న‌వ్వెశాడు. క‌రోనాతో అంద‌రూ మాయ‌మైపోతే.. నువ్వేంటి పెళ్లితో షాక్ ఇచ్చావు అని రానాను బాల‌య్య అడ‌గానే.. రానా అవునండి స‌మాధానం చెప్పేసాడు.

Advertisement

 

balakrishna,rana,balakrishna unstoppable,unstoppable promo highlights  అందరిముందు భార్యకి ఐ లవ్ యు చెప్పిన బాలయ్య

ఇక మిగిలింది పెళ్లినే అందుకే పెళ్లి చేసుకున్నా అంటూ కామెడీ చేశాడు. మీరు మీ భార్య‌కు ఎన్నిసార్లు ఐ ల‌వ్ యూ చెప్పార‌ని బాల‌య్య‌ను రానా అడ‌గ‌గానే.. నీకు ఎందుకయ్య అని బాల‌య్య సెటైర్ వేశాడు. వెంట‌నే ఫోన్ తీసుకుని వ‌సు ఐల‌వ్‌యూ అని చెప్పారు. దానితో వ‌సుంధ‌ర కూడా నాకు తెలుసు మీరు ఎప్పుడూ న‌న్ను ప్రేమిస్తూనే ఉంటారు అని అనేశారు. కోపం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రు మీలో ముందు సారీ చెబుతారు అని రానా బాల‌య్య‌ను ప్ర‌శ్నించారు. దేనికైనా నేనే సారీ చెబుతాను అని బాల‌య్య‌స‌మాధానం చెప్పాడు. శ్రీ‌కృష్ణుడే స‌త్య‌భామ కాళ్లు ప‌ట్టుకున్నాడు. నేనెంత అని బాల‌య్య ఫ‌న్నీగా స‌మాధానం చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading