Home » బాలయ్య ప‌వ‌న్ ఎపిసోడ్ కోసం ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

బాలయ్య ప‌వ‌న్ ఎపిసోడ్ కోసం ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

by AJAY
Ad

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాప‌బుల్ టాక్ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే బాలయ్య షోకు చాలామంది టాప్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. రీసెంట్ గా ప్రభాస్ మరియు హీరో గోపీచంద్ అతిథులుగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉంటే బాలయ్య తన చివరి ఇంటర్వ్యూను పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Advertisement

అంతేకాకుండా బాలయ్య పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ ఈనెల 27న షూటింగ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరికొందరు మాత్రం సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ విడుద‌ల అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య టాక్ షో కు సినిమా తారలే కాకుండా రాజకీయ నాయకులు కూడా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇప్పటికే చంద్రబాబు లోకేష్ లు బాలయ్య టాక్ షో లో సందడి చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ తో జరగబోయే ఎపిసోడ్ లో కూడా రాజకీయాలకు సంబంధించిన అంశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బాలయ్య పవన్ ఎపిసోడ్ లో ఏపీ రాజకీయాలు మరియు తెలంగాణ రాజకీయాలపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీ రాజకీయాలు… జగన్ పరిపాలనపై ఈ ఎపిసోడ్ లో ఫోకస్ చేయబోతున్నట్టు కూడా ఇంటర్నల్ గా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ ను బాలయ్య ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. మరి బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading