టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ఇద్దరూ తమ తమ టాలెంట్ తో అభిమానులను సంపాదించుకున్నారు. బాలయ్య అంటే ఊరమాస్ డైలాగ్ యాక్షన్ సీన్లు కాగా చిరు అంటే డ్యాన్స్ లు మ్యానరిజం గుర్తుకు వస్తాయి. ఇక చిరంజీవి బాలకృష్ణల కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ఇద్దరూ కేవలం ఒకేరకమైన పాత్రల్లో నటించకుండా డిఫరెంట్ జోనర్ లలో సినిమాలు చేసి అదరగొట్టారు.
ఇవి కూడా చదవండి: “లైగర్” సినిమాను మిస్ చేసుకున్న ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేశారంటే.?
Advertisement
బాలయ్య ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా కష్టపడ్డారు. అదే విధంగా చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. చిరు నటించిన సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ లో పసివాడి ప్రాణం, కొండవీటి రాజా, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్ , ఖైదీ సినిమాలు ఉన్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే అన్నపూర్ణమ్మ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
అయితే ఈ సినిమాలన్నింటిలో బాలయ్యకు ఓ సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమా మరేదోకాదు. చిరంజీవి శ్రీదేవి హీరో హీరోయిన్ లుగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా…1990లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి జంధ్యాల కథను రాశారు.
అంతే కాకుండా ఈ సినిమాకు లెజెండీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలోని అమ్మనీ కమ్మనీ దెబ్బ పాట అప్పట్లో చార్ట్ బస్టర్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకులు అభిమానులకే కాదు బాలయ్యకు కూడా తెగ నచ్చేసిందట.