నందమూరి తారక రామారావు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసాడు. అహర్నివలు కష్టపడుతూ పాతాళభైరవి, జగదేక వీరుడి కథ, గుండమ్మ కథ, మాయా బజార్ వంటి అద్భుతమైన సినిమాలను మనకు ప్రసాదించాడు. ఈ దిగ్గజ నటుడి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అది అందరికీ కామన్ అయినప్పటికీ ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు బాలయ్య బాబు ఇప్పటికీ బాధ పడుతుంటాడు. ఆ సినిమా మరేదో కాదు.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన నరసింహ.
Advertisement
ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ ఈ సినిమా కథను తొలుత బాలకృష్ణకే వినిపించాడట. ఆ సమయంలో బాలయ్య బాబు సమరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందువల్ల అతను వేరే సినిమాను చేయాలనే ఆసక్తిని చూపలేదు. దీని వల్ల చిన్నికృష్ణ ఆ కథను తమిళ దర్శకుడు కే.ఎస్.రవికుమార్ వద్దకు తీసుకెళ్లాడు. కథ చాలా బాగుండటంతో రజినీకాంత్ హీరోగా సెలెక్ట్ చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో డైలాగ్ లు, డ్యాన్స్, కామెడీ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి.
Advertisement
ఇందులో హీరోగా బాలకృష్ణను సెలెక్ట్ చేసుకున్నా బాగానే నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేవాడు. ఆ క్యారెక్టర్ బాలయ్య కి బాగా సూట్ అయ్యేది. రమ్యకృష్ణకు ధీటుగా నటించి అదరగొట్టేవాడు. ఈ మంచి అవకాశాలన్నీ మిస్ అయిపోయాయి. దీనిని మిస్ చేసుకోవడం బాలయ్య దురదృష్టం అని చెప్పుకోవచ్చు. దీనిని మిస్ కావడంతోనే బాలయ్య కెరీర్ కి వచ్చిన నష్టమేమి లేదు. కానీ అందులో చేసి ఉంటే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి లభించేది. అలాగే బాలయ్య నరసింహుడిగా ఉగ్రవతారంలో కనిపించే ఛాన్స్ దక్కేది. స్టైలిష్ గా కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి బాలకృష్ణకి అద్భుతమైన అనుభూతి కలిగి ఉండేది.