Home » పేకాట‌కి బానిసైన బాల‌కృష్ణ‌.. డబ్బులన్ని పోగొట్టుకున్నాడా..?

పేకాట‌కి బానిసైన బాల‌కృష్ణ‌.. డబ్బులన్ని పోగొట్టుకున్నాడా..?

by Anji

నందమూరి నటసింహం బాలకృష్ణ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరమే లేదు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చి ఎన్నో అద్బుతమైన సినిమాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక ఇలా ఎన్నో జానర్స్ లో తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలను చేస్తున్నాడు బాలయ్య. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు పక్కా మాస్ ఎలివేషన్ ఇచ్చేవిధంగా కథను సిద్ధం చేసి సినిమాను రూపొందిస్తున్నారు. వీరసింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన చిన్నపాటి టీజర్ సినిమాపై ఉన్న ఎక్స్ పెక్టేషన్ ను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లిపోయింది. బాలకృష్ణ సార్ హీరో అయినప్పటికీ కూడా తనలో ఉన్న కొన్ని అలవాట్లు మాత్రం ఇప్పటికీ మార్చుకోలేదట. బాలయ్యకి పేకాట ఆడే అలవాటు ఉందట. తాజాగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “నేను బాలయ్యతో నటించిన ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ సమయంలో బాలయ్య నాతో ఎంతో సరదాగా ఉండేవారు. షూటింగ్ సమయంలో బాలకృష్ణ ననున్న మీకు పేకాట ఆడడం వచ్చా అని అడిగారు. వచ్చని చెప్పగానే ఇద్దరం పేకాట ఆడడం మొదలుపెట్టాం. 

Also Read :  ‘మా సినిమాలను అడ్డుకుంటే.. తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటాం’

పేకాట ఆడి పది రూపాయలు పోగొట్టుకున్నారు. కొద్దిసేపు అయ్యాక నేను వెళ్తాను సార్ అని చెప్పినా వినలేదు. నువ్వు ఇప్పుడు ఆడాల్సిందే” అని బాలకృష్ణ పట్టుబట్టారు. ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అంటూ జి.నాగేశ్వర్ రెడ్డి సదరూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న చాలా మంది బాలకృష్ణ పేకాట ఆడుతారా అంటూ నోరెళ్లపెడుతున్నారు. సరదాగా పేకాట ఆడేవారు తప్ప, ఎప్పుడూ కూడా దానికి బానిసై డబ్బులు పోగొట్టుకుంది లేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. బాలయ్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి కొత్త కొత్త గెస్ట్ లను తీసుకొస్తూ అభిమానుల ప్రశంసలు పొందుతున్నారు. 

Also Read :   ఒకప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు అద్దె ఇంట్లో.. కాంతారావు కొడుకు భావోద్వేగం..!

Visitors Are Also Reading