Home » 2001 సంక్రాంతి ఫైట్…చిరు,వెంక‌టేష్ లను కోలుకోలేని దెబ్బ‌కొట్టిన బాల‌య్య‌..!

2001 సంక్రాంతి ఫైట్…చిరు,వెంక‌టేష్ లను కోలుకోలేని దెబ్బ‌కొట్టిన బాల‌య్య‌..!

by AJAY
Ad

సంక్రాంతి అంటే ఇప్ప‌డే కాదు ఒక‌ప్ప‌టి నుండి థియేట‌ర్ల వ‌ద్ద సినిమాలు సంద‌డి క‌నిపించేది. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ ప‌డేవారు. సాధార‌ణ స‌మయాల్లో కంటే సంక్రాంతి హిట్ కొడితే ఆ కిక్కే వేర‌ని కూడా సంక్రాంతి అంటే ఇప్ప‌డే కాదు ఒక‌ప్ప‌టి నుండి థియేట‌ర్ల వ‌ద్ద సినిమాలు సంద‌డి క‌నిపించేది.

narasimhanaidu-mrugaraju

narasimhanaidu-mrugaraju

ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ ప‌డేవారు. సాధార‌ణ స‌మయాల్లో కంటే సంక్రాంతి హిట్ కొడితే ఆ కిక్కే వేర‌ని కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉండ‌గా 2001 సంక్రాంతికి కూడా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్ల‌లో విడుద‌ల‌య్యాయి. ఆ హీరోలు కూడా ఎవ‌రోకాదు..వెంక‌టేష్, చిరంజీవి, బాల‌కృష్ణ‌.

Advertisement

ALSO READ : ఆహ్వానం అందినా మీటింగ్ కు వెళ్ల‌ని ఎన్టీఆర్..కార‌ణం అదేనా…!

mrugaraju movie

mrugaraju movie

ఇక చిరంజీవి హీరోగా మృగ‌రాజు సినిమా విడుద‌ల కాగా ఈ చిత్రానికి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అప్ప‌ట్లో ఈ సినిమాకు ఏకంగా 10 కోట్లు ఖ‌ర్చు చేశారు. హాలీవుడ్ సినిమాను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని తెర‌కెక్కించ ఈ సినిమాలో న‌టించిన సింహానికే ఏకంగా 67 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశార‌ట‌. సినిమా కోసం చిరు 20 గంట‌ల పాటూ కష్ట‌ప‌డ్డారట‌. కానీ ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో జ‌న‌వ‌రి 11న విడుద‌లై మెగాస్టార్ కెరీర్ లోనే డిజాస్ట‌ర్ గా నిలిచింది.

Advertisement

deviputhrudu movie

ఇక ఇదే రోజున బాల‌కృష్ణ హీరోగా విడుద‌లైన న‌ర‌సింహ‌నాయుడు విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలించింది. ఈ చిత్రానికి 30 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. సినిమాలో బాల‌య్య చెప్పిన క‌త్తుల‌తో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ చెప్పే డైలాగ్ ఇప్ప‌టికీ ఒక హైలెటే అని చెప్పాలి. ఈ సినిమా 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి హీరో వెంక‌టేష్ కూడా బరిలోకి దిగారు.

narasimhanayudu

narasimhanayudu

ఎంఎస్ రాజు నిర్మాణంలో వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన దేవి పుత్రుడు సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేశారు. ఈ సినిమాలో భారీ గ్రాఫిక్ కార‌ణంగా బ‌డ్జెట్ కూడా ఎక్కువే అయింద‌ట‌. ఇక ఈ చిత్రానికి ఏకంగా ఎంఎస్ రాజుకు 14 కోట్ల న‌ష్టాలు వచ్చాయి. అలా 2001లో భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాల‌పై బాల‌య్య విజ‌యం సాధించారు.

Visitors Are Also Reading