నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరందరూ కలిసి మెలిసి ఉండే వారు. కానీ ఉన్నట్టుండి వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ గత కొద్ది రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్-బాలకృష్ణ అభిమానుల మధ్య వివాదం నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ వివాదం ఇప్పుడు పర్సనల్ వరకు వెళ్లింది. ఎన్టీఆర్ ఎన్ ట్యాగ్ తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.
Advertisement
ఇటీవలే నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాన్ రామ్. వీరితో పాటు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఇలా అందరూ నివాళులర్పించారు. అయితే ఇందులో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని బాలబాలకృష్ణ చేసిన కామెంట్ పెద్ద వివాదంగా మారింది. బాలకృష్ణ `ఇప్పుడే.. తీసేయ్` అనే డైలాగ్ తెగ వైరల్ అయింది. ఎన్టీఆర్ ఫ్లెక్సీలనే తీసేయమన్నారని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ అదే ప్రొజెక్ట్ అయ్యింది. అయితే మురళి అనే వ్యక్తి హైలైట్‌గా ఈ ఫ్లెక్స్ లు ఉన్నాయని.. అదే సమయంలో వర్థంతి రోజు `స్వాగతం, సుస్వాగతం` ఫ్లెక్సీలేంటి అని బాలయ్య వాటిని తొలగించమన్నారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు.
Advertisement
అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగింది. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ-వైసీపీ నాయకులు రియాక్ట్ కావడంతో రచ్చ కాస్త ఎక్కువనే అయింది. ఈ సమయంలో బాలయ్య అభిమానుల ఛాటింగ్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతుంది. ఎన్టీఆర్-బాలబాలకృష్ణ సినిమాలపై చర్చించారు. అందులో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ తారక్ సినిమాలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు చెప్పుకోవడానికి నీకు ఒక్క 100 కోట్ల సినిమా లేదంటూ.. నీ స్టార్ డమ్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు.. నందమూరి ట్యాగ్ తీసేయమంటున్నారు. ఒకప్పుడు బాలయ్య-చిరంజీవి సినిమాలు పోటీపోటీగా ఆడేవని.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు ఎవ్వరికీ పోటీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు బాలకృష్ణ అభిమానులు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!