Home » అన్‌స్టాప‌బుల్ బాల‌య్య‌… వెన్నుపోటుపై ఎమోష‌న్‌…

అన్‌స్టాప‌బుల్ బాల‌య్య‌… వెన్నుపోటుపై ఎమోష‌న్‌…

by Bunty
Ad

బాల‌కృష్ణ అఖండ సినిమా మంచి విజ‌యం సాధించింది. క‌రోనా త‌రువాత రిలీజైన భారీ చిత్రం, బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో వ‌చ్చిన మూడో సినిమా కావ‌డంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. కంటెంట్ ప‌రంగా సినిమా అద్భుతంగా ఉండ‌టంతో సినిమాకు ప్ల‌స్ అయింది. ఈ సినిమాకు రిలీజ్ కు ముందు నుంచి బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే ఓ రియాలిటి షో చేస్తున్నారు. ఈ రియాలిటీ షోకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ది. చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ న‌టులు బుల్లితెర‌పై షోలు చేస్తున్నారు. అటు యంగ్ హీరోలు కూడా బుల్లితెర‌పై షోలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

కాగా, ఇప్పుడు బాల‌య్య‌కూడా అదే ఫార్ములాలో అన్ స్టాప‌బుల్ షో చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు షోలు చేశారు. నాలుగు ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. అన్ స్టాప‌బుల్ లేటెస్ట్ షోలో అఖండ టీమ్ సంద‌డి చేసింది. ఈ షోలో అఖండ సినిమా గురించి ఆద్యంతం చ‌ర్చ జ‌రిగింది. స‌ర‌దా స‌ర‌దాగా షో న‌డిచింది. అయితే, ఈ షో చివ‌ర్లో వెన్నుపోటు అంశంపై బాల‌య్య చాలా ఎమోష‌న్ అయ్యారు. ప్ర‌తి ఒక్క‌రూ వెన్నుపోటు వెన్నుపోటు అంటూ కామెంట్ చేస్తున్నార‌ని, తాను ఆయన కుమారుడిని మాత్ర‌మే కాద‌ని, ఆయ‌న‌కు అత్యంత అభిమానిన‌ని బాల‌య్య చెప్పారు.

Advertisement

Visitors Are Also Reading