టాలీవుడ్ అగ్ర హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. వాస్తవానికి బాలకృష్ణ 10 సినిమాలు తీస్తే అందులో హిట్ అయ్యేది మూడు, నాలుగు మాత్రమే. కానీ ఫ్లాప్ అయిన ఆ సినిమాలను మైమరిపించేలా బాలయ్య హిట్ సినిమాలు ఉంటాయి. అందుకే బాలయ్యకి ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా ఇంత క్రేజ్ ఉంటుంది. బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మగారి మనవడు సినిమా 500 రోజులు ఆడి భారతదేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది.
Advertisement
ఈ తరుణంలోనే 1999లో సమరసింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమా ద్వారా బాలయ్య మార్కెట్ నెంబర్ వన్ పొజిషన్‌కి చేరుకుంది. సమరసింహారెడ్డి 77 కేంద్రాల్లో 100 నడిచింది. ఇక ఆ సినిమా తరువాత బాలకృష్ణ, సిమ్రాన్, దర్శకుడు బి.గోపాల్, సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్‌లో నరసింహానాయుడు సినిమా వచ్చింది. 2001లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న నరసింహానాయుడు విడుదల అయింది. అదే రోజు చిరంజీవి నటించిన మృగరాజు కూడా విడుదలైంది. మొదటిరోజు చిరంజీవి సినిమాకే క్రేజ్ ఎక్కువ ఉంది. రెండవ రోజు నుంచి నరసింహానాయుడు థియేటర్లలో టికెట్లు కూడా దొరికేవి కావు.
Advertisement
Also Read : ఆ సినిమాలను సొంత బిడ్డలా ప్రేమిస్తానంటున్న మహానటి..!
అదేవిధంగా జనవరి 14, 2001న వెంకటేష్ దేవిపుత్రుడు సినిమా విడుదలైంది. మృగరాజు, దేవిపుత్రుడు సినిమా డిజాస్టర్లు అయితే.. బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు భారతదేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. డైరెక్ట్‌గా విడుదలై 127 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న నరసింహనాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక హీరో నటించిన సినిమా 100 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం అదే మొదటి సారి. ఈ అరుదైన ఘనత బాలకృష్ణకే దక్కింది. ముఖ్యంగా దర్శకుడు బి.గోపాల్ టేకింగ్, చిన్నికృష్ణ కథ, బాలకృష్ణ నట విశ్వరూపం, సెంటిమెంట్, మణిశర్మ సంగీతం అన్ని కలిసి నరసింహనాయుడు సినిమాను రికార్డు సృష్టించే విధంగా చేశాయి.
Also Read : త్రివిక్రమ్ తొలి సినిమాకి 20 ఏళ్లు.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!