సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం అనేది చాలా మామూలు విషయం. అయితే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సినిమా అన్నమయ్య.
Advertisement
అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఎంతో మంది ఆశ్చర్యపోయారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాగార్జున ఓ రొమాంటిక్ హీరోగా అభిమానుల మనసులో ముద్ర వేసుకున్నాడు అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ప్రేమ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.
అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఓ భక్తి సినిమా రావడం అనేది అభిమానులను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున అన్నమయ్య పాత్రలో కనిపించగా వెంకటేశ్వరస్వామి గా సుమన్ కనిపించాడు.
Advertisement
అయితే సుమన్ చేసిన ఈ వెంకటేశ్వరస్వామి పాత్ర మొదట తనకు రాలేదట. ఎందుకంటే… ఈ సినిమాలో నాగార్జున చాలాసార్లు ఆ వేంకటేశ్వరుని పాదాల పైన పడాల్సి ఉంటుంది అందుకే ముందు ఇద్దరు పెద్ద హీరోల వద్దకు ఈ పాత్ర వెళ్లిందని తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు కె.రాఘవేంద్రరావు శోభన్ బాబు ని సంప్రదించారట. కానీ అప్పటికే సినిమాలకు దూరమైన శోభన్ బాబు చేయలేను అని చెప్పలేక ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటంతో ఆయన్ని కాదని బాలకృష్ణ వద్దకి ఈ పాత్ర వచ్చిందట. కానీ ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో ఇలా కనిపిస్తే అభిమానులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని బాలకృష్ణ కూడా నో చెప్పాడట. ఆ తర్వాతే ఈ పాత్ర సుమన్ వద్దకు వెళ్ళింది అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!