Home » ముద్దు సీన్ లో బాల‌య్య చేసిన ప‌నికి కెవ్వుమ‌ని అరిచిన మీనా..ఆయ‌న ఏం చేశారంటే..?

ముద్దు సీన్ లో బాల‌య్య చేసిన ప‌నికి కెవ్వుమ‌ని అరిచిన మీనా..ఆయ‌న ఏం చేశారంటే..?

by AJAY
Ad

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు ఆహా ఓటిటిలో టాక్ షోలోనూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటిటిలో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో హోస్ట్ గా చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇక తాజాగా ఈ టాక్ షోకు యంగ్ హీరో లు అడవి శేషు, శర్వానంద్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య ఇద్దరు యంగ్ హీరోలను ఒక ఆట ఆడుకున్నారు. షోలో భాగంగా…..సినిమాల్లో హీరోయిన్లతో ముద్దు సన్నివేశాల ప్రస్తావన వచ్చింది.

Advertisement

కాగా బాలయ్య తన కెరీర్ లో జరిగిన ఓ ముద్దు సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. బాలకృష్ణ 1994లో బొబ్బిలి సింహం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో రోజా మరియు మీనా హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో మీనాతో తనకు జరిగిన అనుభవం గురించి బాలయ్య చెప్పుకొచ్చారు.

Advertisement

బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్ వేమూరు గుట్ట పైన జరిగిందని అన్నారు. పక్కనే రజినీకాంత్ మీనా ల సినిమా షూటింగ్ జరుగుతుందని అన్నారు. దాంతో బొబ్బిలి సింహం ఓపెనింగ్ కు మీనాతో పాటూ ర‌జినీకాంత్ కూడా వచ్చారని చెప్పారు. దానికి కారణం మీనా తమ సినిమాలో కూడా నటిస్తోందని తెలిపారు. ఓపెనింగ్ షాట్ కు రజనీకాంత్ క్లాప్ కొట్టారని అన్నారు.

తాను సీరియస్ డైలాగ్ చెప్పుతున్నానని ఆ డైలాగ్ తర్వాత అవుట్ ఫీల్డ్ నుండి మీనా వచ్చి తనకు చెంప‌పై ముద్దు పెట్టాలని అన్నారు. ఆ సీన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ ఇంకా రావడంలేదని తాను వెనక్కి తిరిగానన్నారు. దాంతో ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చిన‌ మీనా పెదాలు తన పెదాల ద‌గ్గ‌ర‌కు వచ్చాయని చెప్పారు. దాంతో ఒక్కసారిగా మీనా కెవ్వుమ‌ని అరిచింద‌ని బాలకృష్ణ తెలిపారు. అంతేకాకుండా మీనా షాక్ అయిందని బాలయ్య సరదాగా తనకు జరిగిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

Visitors Are Also Reading