Home » బాల‌య్య 108 సినిమాలో హీరోయిన్ గా రాయ‌ల‌సీమ అమ్మాయి..? ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

బాల‌య్య 108 సినిమాలో హీరోయిన్ గా రాయ‌ల‌సీమ అమ్మాయి..? ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను సాహూ గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎఫ్2 లాంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావి పూడి మాస్ హీరో బాలకృష్ణతో సినిమా చేయడం వల్ల ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎంతగానో నెలకొంది.

Advertisement

బాలయ్య మాస్ హీరో మ‌రి అనిల్ రావిపూడి బాల‌య్య‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది కూడా ప్రేక్షకులను చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాల్సింది. కానీ బాలకృష్ణను డిఫరెంట్ యాంగిల్ లో చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 8 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. అయితే మొదటి నుండి సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

అప్పట్లో ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో ప్రచారం మొదలైంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వ‌స్తోన్న‌ చిత్రంలో హీరోయిన్ గా తెలుగమ్మాయి ప్రియాంక జవాల్క‌ర్ నటించబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. ప్రియాంక జవాల్క‌ర్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా టాక్సీవాలా ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాల్లో తన అందంతో ఆకట్టుకుంది. ప్రియాంక జవాల్క‌ర్ పుట్టింది పెరిగింది కూడా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కావడం విశేషం. అయితే ఈ సినిమాలో ప్రియాంక జవాల్క‌ర్ సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందని టాక్.

Visitors Are Also Reading