కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ ఆచార్య. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29వ తేదీన విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. మొదటి రోజే నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో బయ్యర్లకు చాలా నష్టం వచ్చింది. సినిమాని అధిక ధరలకు కొనుగోలు చేసిన బయ్యర్లు మేము దారుణంగా నష్టపోయామని, మూవీ విడుదల తర్వాత ఏ మాత్రం కలెక్షన్లు కూడా రాకపోవడంతో నష్టాల్లో కూరుకుపోయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో చిరంజీవి ఆదుకోవాలని కోరుతూ గత మూడు రోజుల నుంచి మెగాస్టార్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు బయ్యర్లు. కానీ చిరంజీవి మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన వీరి పరిస్థితి తెలిసి విదేశాలకు వెళ్లారో లేదో తెలియదు కానీ బయ్యర్లు మాత్రం కోపానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ బయ్యర్లకు మరొక షాకింగ్ విషయం తెలిసింది. మెగాస్టార్ యూరప్ మరియు అమెరికా పర్యటనలో భాగంగా దాదాపు నెల రోజుల తర్వాత తిరిగి వస్తారని తెలుస్తోంది. దీంతో బయ్యర్లు చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే మీకు విదేశీ సరదాలు కావాల్సి వచ్చిందా అంటూ, మేము బాధపడుతుంటే మీరు ఆనందిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో తెలియాల్సి ఉంది.
Advertisement
ALSO READ :
Advertisement
టీవీ9 దేవి నాగవల్లికి కనీసం రెండేళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఎందకో తెలుసా ?
ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?