రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ తోనే ఎక్కువ సినిమా చేసాడు. వీరి కాంబినేషన్ లో మొత్తం ఇప్పటికే 4 సినిమాలు వచ్చాయి. అందులో తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఎన్టీఆర్ ను హార్ట్ చేసాడు అనే వాదన సినిమా విడుదల తర్వాత వచ్చింది. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాది బాహుబలి వినయ్.
Advertisement
రాజమౌళి తీసిన చాలా సినిమాల్లో వినయ్ ఉన్నాడు. అయితే బాహుబలి తర్వాత దానినే తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడు. తాజాగా వినయ్ ఇచిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈనాటి వ్యక్తి అనేదాని గురించి మాట్లాడిన అతను.. తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ పై వచ్చిన వార్తల గురించి కామెంట్స్ చేసాడు. రాజమౌళి సినిమాలో చేసే హీరోను ఎలా చూస్తాడో.. చిన్న ఆర్టిస్ట్ ను కూడా అలానే చూస్తారు. ఆయనకు ఈగో అనేది లేదు.
Advertisement
ఇక ఎన్టీఆర్, రాజమౌళి మధ్య మంచి స్నేహం అనేది ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన పాత్ర తక్కువ అని వార్తలు వస్తాయి అని వారు ముందే అనుకుంటారు. ఎందుకంటే రాజమౌళి సినిమా విడుదల తర్వాత ఎలాంటి వార్తలు వస్తాయి అని ముందే ఆలోచించుకుంటారు. అవి ముందే హీరోలతో మాట్లాడుకుంటారు. ఒకవేళ నిజంగా రాజమౌళి.. రామ్ చరణ్ పాత్ర ఎక్కువ అని ఎన్టీఆర్ కు చెప్పిన.. ఆయన ఏం అన్నడు.. పెట్టేసేయ్ అంటాడు. వారి స్నేహం అలాంటింది అని వినయ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :